Dyslexia disease
-
ఓ గూటికి చేరిన చెదిరిన అక్షరం
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్‌లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్‌లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్‌లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్‌లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది. ‘‘నా బాల్యంలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.బాధపెట్టిన బాల్యంనాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.అద్దెలేని హాస్టల్ గదిలో..ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్‌లెస్ పుస్తకం.కోపగించుకున్నా.. కుటుంబ మద్దతుఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.సమాజంలో మార్పుకుఅనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి. -
అవగాహనే ప్రధానం
ఏడీహెచ్‌డీ, సెరిబ్రల్ పాల్సీ, ఇతర మనోవైకల్యాలు ఉన్న పిల్లల మానసిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు హైదరాబాద్ వాసి ఫరీదా రాజ్.స్పెషల్ చిల్డ్రన్కు శిక్షణ ఎలా ఇవ్వాలనే అంశాల మీద టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సెంటర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టీచర్ ట్రైనర్, రెమెడియల్ ఎడ్యుకేటర్, రైటర్ అయిన ఫరీదా రాజ్ తన రచనల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పిల్లల్లో వచ్చే డిస్లెక్సియాపై పుస్తకాలు రాసిన ఫరీదా రాజ్ ఇటీవల ‘అన్బ్రేకబుల్ స్పిరిట్ – నావిగేటింగ్ లైఫ్ విత్ ఎమ్మెస్ పేరుతో మల్టిపుల్ స్కెర్లోసిస్పై పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది భారతదేశంలో వైద్య లేదా వైద్యేతర వ్యక్తి రాసిన మొట్టమొదటి పుస్తకంగా పేరొందింది. సరైన రోగ నిర్ధారణ, సకాలంలో చికిత్స, సంరక్షణ, కుటుంబ మద్దతుతో వ్యక్తులు సుదీర్ఘమైన, చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాలను గడపవచ్చని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా చెబుతారు ఆమె. ‘‘ఇటీవల చాలా కుటుంబాల్లో తెలియని అలజడిని సృష్టిస్తున్న సమస్య మల్టిపుల్ స్కెర్లోసిస్. దీనిని ఒక జబ్బుగా కాకుండా అవగాహనతో సరిదిద్దాల్సిన అంశంగా గుర్తించాలి. సమస్యతో ఇబ్బంది పడుతున్నవారిని నేరుగా కలిసి, వారి వేదనను, చికిత్సా విధానాలను ఇందులో పొందుపరించాను. స్పెషల్ కిడ్స్ సామర్థ్యాలకు.. నేను స్కూల్ టీచర్‌గా ఉన్న మొదటి రోజులవి. ట్రైనింగ్ పీరియడ్. క్లాస్‌రూమ్‌లో ఉన్నప్పుడు మొదటి రోజే అక్కడి ఓ సంఘటన నన్ను అమితంగా కదిలించింది. ముగ్గురు, నలుగురు పిల్లలు టీచర్ చెబుతున్న విషయంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. వారిలో అసహనం స్థాయులు దాటడాన్ని, టీచర్ సహనం కోల్పోవడాన్నీ గమనించాను. ఎదిగే వయసు పిల్లల్లో సహజంగానే చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమస్య యువతలో మరింత ఎక్కువగా ఉండటాన్ని చూస్తుంటాం. వారిలో ఆందోళన కూడా ఒకింత ఎక్కువే. ఇలాంటప్పుడు వారికి మెంటల్ వెల్బీయింగ్ అవసరం. ఇక మానసిక వైకల్యాలు ఉన్న పిల్లల్లోనైతే అందరికీ వీరి పట్ల నిర్లక్ష్యం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసుకునేవారికి సరైన గైడెన్స్ ఉండటం లేదని ఆ రోజే అనిపించింది. మనోవైకల్యాలు ఉన్న పిల్లల్లో సామర్థ్యాలను వెలికితీయడానికి, వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతిరోజూ కృషి చేయాల్సి ఉంటుంది. అభ్యాసంలో వారిని నిమగ్నం చేయడానికి కొత్త కొత్త మార్గాలను కనుక్కోవాలి. దానిపైనే కృషి చేయాలనుకున్నాను. ఆ తర్వాత అందుకు తగిన పరిష్కారాలనూ కనుక్కున్నాను. వందల మంది టీచర్లకు శిక్షణ స్పెషల్ చిల్డ్రన్కు ఎలాంటి శిక్షణ అవసరమో, అందుకు టీచర్ల నైపుణ్యత ఎలా ఉండాలనే దానిపై రెగ్యులర్ సెషన్స్ నిర్వహించాను. ఇది రాష్ట్రస్థాయిలో మంచి మార్పులు తీసుకువచ్చింది. ఉపాధ్యాయులు, నేర్చుకునే ఇబ్బందులు ఉన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక హ్యాండ్–బుక్ తీసుకువచ్చాను. జన్యులోపాలపై అవగాహన ముంబైలో పుట్టి పెరిగిన నేను, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కి వెళుతున్న తొలినాళ్లలో ఒక రోజు, మానసిక వికలాంగురాలైన పాపతో ఉన్న ఒక మహిళను అక్కడ చూశాను. ఆమెతో మాటలు కలిపితే ఆ పాప ఆమెకు ఏడవ సంతానం అని తెలిసింది. ఆమె ఇతర పిల్లలందరికీ కూడా అదే సమస్య ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలకు అలాంటి సమస్య వచ్చిందని ఆ మహిళకు తెలియదు. ఆ విషయం తెలియక జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం ఆమె ఎప్పుడూ వెళ్లలేదని తెలుసుకున్నాను. దీంతో ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇలాంటి మహిళలకు అవగాహన కల్పించాలని. అప్పటి నుంచి మహిళలకు జన్యుపరమైన కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేదాన్ని. ఈ అంశంపై ఉర్దూ పత్రికతో పాటు జాతీయ స్థాయి పత్రికలలోనూ వీటికి సంబంధించిన కథనాలపై వ్యాసాలు ఇచ్చాను. ఒక్కో అడుగు.. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేయడం నుంచి తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకునే వరకు చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలు ఎన్నో. క్యాన్సర్ పట్ల ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఆంకాలజిస్టులచే కార్యక్రమాల నిర్వహణ నన్ను ఎంతోమందికి చేరువ చేసింది. మల్టిపుల్ స్కెర్లోసిస్తో బాధపడుతున్న వ్యక్తులను చూసినప్పుడు ప్రజలకు ఈ విషయం పట్ల అవగాహన లేదని అర్థ్ధమైంది. దీంతో సమస్యను ఎదుర్కొంటున్నవారిని కలిసి, కదిలించే కథనాలను పాఠకుల ముందుకు తీసుకువచ్చాను’’ అని వివరించే ఫరీదా రాజ్ మల్టిపుల్ స్కెర్లోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కి కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేస్తున్నారు. లాభాపేక్ష లేని ఈ సంస్థ ద్వారా మల్టిపుల్ స్కెర్లోసిస్ బారిన పడిన వ్యక్తుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
రాహుల్‌కు ‘డిస్లెక్సియా’ ఉందా ?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘డిస్లెక్సియా’తో బాధ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఇంజనీరింగ్ విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆరోపించారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని అంతటి మాటతో విమర్శించవచ్చా! అంటూ ట్విట్టర్లో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ‘డిస్లెక్సియా’ అంటే ఏమిటీ ? దాని లక్షణాలేమిటీ ? అది దేశంలో ఎంత మందికి వస్తుంది ? ఎందుకు వస్తుంది ? నిజంగా రాహుల్ గాంధీలో ఆ లక్షణాలు ఉన్నాయా? భారత్‌లోని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఐదు నుంచి 20 శాతం మంది పిల్లలు దీంతో బాధ పడుతున్నారు. భారత దేశంలో పది శాతం మంది పిల్లలు అంటే, మూడున్నర కోట్ల మంది పిల్లలు ఈ లోపంతో బాధ పడుతున్నారు. డిస్లెక్సియా అంటే ఏమిటీ ? ఇది జబ్బు కాదు. నరాలకు సంబంధించి జన్యుపరమైన లోపం. దీనితో బాధ పడుతున్నవారు. సరిగ్గా చదవ లేరు. సరిగ్గా రాయలేరు. సరిగ్గా అర్థం చేసుకోలేరు. పిల్లల్లో పిండం దశలోనే ఈ లోపం ఏర్పడుతుంది. ఈ లోపం కలిగిన వారికి సాధారణ తెలివితేటలు, కొందరిలో ఎక్కువ తెలివితేటలు కూడా ఉంటాయి. స్ట్రోక్ వల్ల పెద్ద వాళ్లలో కూడా ఈ నరాల లోపం ఏర్పడుతుంది. దీన్ని ప్రధానంగా ‘లర్నింగ్ డిఫికల్టీ ప్రాబ్లమ్’గా వైద్యులు వ్యవహరిస్తారు. డిస్లెక్సియా లక్షణాలు డిస్లెక్సియాతో బాధ పడుతున్న పిల్లలు సరిగ్గా, స్పష్టంగా మాట్లాడలేరు. వారికి ఎక్కువ పదాలు కూడా తెలియవు. చిహ్నాలను, శబ్దాలను డీకోడ్ చేయడంతో ఇబ్బంది పడతారు. దీని ప్రభావం కొందరిలో ఒకలాగ, మరి కొందరిలో ఒకలాగా ఉంటుంది. కొందరు ‘డీ’ అనే పదాన్ని ‘బీ’గా గుర్తిస్తే మరి కొందరు ‘బీ’ అనే పదాన్ని ‘డీ’గా గుర్తిస్తారు. ఇంకొందరు ఒకసారి ‘డీ’గాను మరోసారి ‘బీ’గాను గుర్తిస్తారు. అలాగే అర్థం చేసుకుంటారు. అలాగే మాట్లాడుతారు. వీరికి గణాంకాల క్రమం కూడా గుర్తుండదు. అంటే 1,2,3,4,5....వరుస క్రమాన్ని గుర్తించలేదు. లెక్కల్లో తప్పులు చేస్తారు. ఎలా నేర్చుకుంటారు ? ఈ లోపంతో బాధ పడుతున్నవారికి సంప్రదాయబద్ధంగా విద్యను నేర్పితే వారు నేర్చుకోలేరు. అంటే కళంతో కాగితంపై, బలపంతో స్లేట్‌పై రాసి నేర్పితే వారి బుర్రకు ఎక్కదు. అదే ఇసుకలో చేతి వ్రేలుతో రాస్తూ అక్షరాలు నేర్పితే వారు సులువుగా నేర్చుకుంటారు. కళ్లతోని, సైగలతో, శబ్దాలతోని కూడా సులువుగా నేర్చుకుంటారు. పదాల నేపథ్యాన్ని, భాష నేపథ్యాన్ని వివరిస్తే సాధారణ విద్యార్థులకన్నా త్వరగా నేర్చుకుంటారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ...ఇలా భాష పరంగా కూడా పిల్లలు నేర్చుకోవడంలో తేడాలు ఉంటాయి. ఏ స్థాయిలో ఉందో, ఎలా గుర్తించాలి ? ఏ పిల్లల్లో ఇది ఏ స్థాయిలో ఉందో స్క్రీనింగ్ చేయడానికి 2015 వరకు భారత్‌లో ఓ పరికరం, లేదా కచ్చితమైన విధానం అంటూ లేదు. ‘నేషనల్ బ్రెయిన్ రీసర్చ్ సెంటర్’ 2015లో ‘డిస్లెక్సియా ఆసెస్మెంట్ ఇన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా’ లేదా క్లుప్తంగా ‘డాలి’ అనే ఓ విధానాన్ని రూపొందించి. హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే ఈ విధానం అమల్లోకి వచ్చింది. సాధారణంగా ఎనిమిదేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య పెరుగుతున్నా కొద్ది క్రమంగా తగ్గిపోతుంది. ఇక రాహుల్ గాంధీ ఈ జన్యుపరమైన లోపంతో బాధ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారంటే అది కచ్చితంగా వ్యంగ్యమే అవుతుంది. ఓ ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అంతటి వ్యంగ్యం అవసరమా !? -
చీకటి జీవితాలకు వెలుగునిచ్చాడు...
ఆదర్శం బతుకే వద్దనుకున్నాడు. బతకడం వృథా అనుకున్నాడు. ఎందరికో బతుకునిస్తున్నాడు. ‘‘నేను జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయను... చావును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎందుకంటే, నేను చనిపోయి నప్పుడు...ప్రజలు నేను చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకోవాలి’’ అంటాడు స్వప్నీల్. అతడి బాల్యమంతా బాధలోనే గడిచింది. డిసొలెక్సియా వ్యాధి అతణ్ని చిత్రవధ చేసింది. తన లోపాన్ని చూసి కుంగిపోయేవాడు. అందరూ హేళన చేస్తుంటే సిగ్గుతో చితికిపోయేవాడు. అలాంటప్పుడు తండ్రి అతడిలో ధైర్యం నూరి పోసేవాడు. కానీ తండ్రి హఠాత్తుగా కారు ప్రమాదంలో చనిపోవడంతో...ఆ వెలితిని తట్టుకోవడం పదమూడేళ్ల స్వప్నీల్ వల్ల కాలేదు. జీవితంలో దుఃఖం తప్ప ఏమీ లేదని, చావులోనే సుఖం ఉన్నదనే నిర్ణయానికి వచ్చాడు. స్లీపింగ్ పిల్స్ చేతిలోకి తీసుకున్నాడు. కానీ మింగ లేదు. ఒక మనిషిలో రెండు శక్తులు ఎప్పుడూ పోట్లాడుకున్నట్లే... స్వప్నీల్లో కూడా దట్టమైన నిరాశ, ఉత్తేజిత ఆశ పోరాడాయి. మెల్లిగా నిరాశ మీద ఆశ పై చేయి సాధించడం మొదలైంది. ‘జీవితం అంటే తినిపడుకోవడం కాదు... ఏదో ఒకటి సాధించడం, నలుగురికి మంచి చేయడం’ అని ఓసారి ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. స్లీపింగ్ పిల్స్‌ని డస్ట్‌బిన్‌లో వేశాడు. తన మనసులోంచి నిరాశను తీసి పారేశాడు. కష్టపడి చదివాడు. ఎంబీఏ పూర్తి చేసి ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో చేరాడు. రిజర్వ బ్యాంక్‌లో పనిచేసే స్థాయికి చేరాడు.డబ్బు, హోదా, పలుకుబడి... అన్నీ ఉన్నాయి స్వప్నీల్కి. కానీ అందులో ఏదీ అతడికి సంతోషాన్ని ఇవ్వలేదు. తాను ఒక సంస్థకి కాదు, సమాజానికి ఉపయోగ పడాలి అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో మధుబని కళాకారుల కుటుంబం ఒకటి కష్టాల్లో ఉండడం చూశాడు. ఇంకా అలాంటి కుటుంబాలెన్నో బిహార్‌లో బాధలు పడుతుండటం గమనించాడు. వారికి తన వంతుగా సహాయపడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీలో ‘నేక్డ్ కలర్స్’ అనే సంస్థను ప్రారంభించాడు. మధుబని కళాకారుల కళాకృతులను మార్కెటింగ్ చేస్తూ వారికి ఆర్థికంగా ఉపయోగపడడం ప్రారంభించాడు. తంజావూర్, గోండు కళాకారులకు సైతం చేయూతనిచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు అనుకోకుండా ఓ నక్సలైట్ ఏరియాకి వెళ్లాడు స్వప్నీల్. వాళ్ల కుటుంబాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నాయో, వారి పిల్లలు చదువు లేకుండా ఎలా వెనుకబడిపోతున్నారో చూశాడు. ఆ పిల్లలకు అక్షరాలు నేర్పాలని, వారి జీవితాలను మార్చాలని సంకల్పిం చాడు. కానీ అతడి ఆలోచనను వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అతడి వల్ల తమకు హాని ఉందని భయపడి స్వప్నీల్ను కిడ్నాప్ చేశారు. కొన్ని రోజుల పాటు చిత్ర హింసలు పెట్టారు. తర్వాత ఎప్పటికో అతడి ఆశయం అర్థమై వదిలిపెట్టారు. అతడు చేయాలనుకున్నదానికి అనుమతి ఇచ్చారు. దాంతో స్వప్నీల్ తన పని తాను చేసుకుపోయాడు. ఎంతో మంది పిల్లల్ని అక్షరాస్యుల్ని చేశాడు. అలాగే స్వప్నీల్ చూపు రెడ్‌లైట్ ఏరియాల వైపు ప్రసరించింది. పొట్టకూటి కోసం పడుపు వృత్తిలోకి దిగిన మహిళలతో పలు దఫాలుగా మాట్లాడి, వారిని ఆ వృత్తి నుంచి తప్పించి గౌరవ ప్రదమైన ఉపాధి మార్గాల వైపు మళ్లిస్తున్నాడు. దానితో పాటు డిప్రెషన్లో ఉన్నవారి దగ్గరకు వెళ్లి ‘బిహేవియర్ సైకాలజీ’, ‘పాజిటివ్ థింకింగ్’కు సంబంధించి క్లాసులు తీసుకుంటూ ఉంటాడు. రకరకాల సమస్యలతో కుంగుబాటుకు గురై, ఆత్మహత్య చేసుకో వాలనుకున్న చాలామంది మనసు మార్చి జీవితంపై ఆశలు చిగురింపజేశాడు. జీవించేందుకు తగిన మానసిక స్థైర్యాన్ని ఇచ్చాడు. మరోపక్క మహిళల భద్రత మీద కూడా దృష్టి పెట్టాడు. ‘పింక్ విజిల్’ పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించి, ‘శక్తి’ పేరుతో ఒక విజిల్ తయారుచేశాడు. ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు, విజిల్ మీద ఉన్న బటన్‌ను నొక్కితే, ఆత్మ రక్షణ చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న కత్తి బయటికి వస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఎందరికో మార్గదర్శకు డయ్యాడు స్వప్నీల్. అతడు మాటల మనిషి కాదని, చేతల మనిషని అతని జీవిత పాఠాలను చదివితే సులభంగా అర్థమవుతుంది!