
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు భువన కాల్వ, సామ సాత్విక, సాయి సంహిత చామర్తి ముందంజ వేశారు. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు మెయిన్ డ్రా పోటీలకు మరో విజయం దూరంలో నిలిచారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో పదో సీడ్ భువన 7–6 (7/3), 6–4తో నటాషాపై గెలుపొందగా... పన్నెండో సీడ్ సామ సాత్విక 6–0, 6–0తో వైదేహిని చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ సాయి సంహిత 6–2, 6–2తో ఫర్హత్ అలీన్ ఖమర్‌పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment