Bhuvana
-
మెయిన్ ‘డ్రా’కు చేరువలో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు భువన కాల్వ, సామ సాత్విక, సాయి సంహిత చామర్తి ముందంజ వేశారు. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు మెయిన్ డ్రా పోటీలకు మరో విజయం దూరంలో నిలిచారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో పదో సీడ్ భువన 7–6 (7/3), 6–4తో నటాషాపై గెలుపొందగా... పన్నెండో సీడ్ సామ సాత్విక 6–0, 6–0తో వైదేహిని చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ సాయి సంహిత 6–2, 6–2తో ఫర్హత్ అలీన్ ఖమర్పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. -
మలేషియా మహిళ అదృశ్యం
టీ.నగర్: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా, మేట్టుపాళయంలో భర్తతోపాటు విహారయాత్రకు వచ్చిన మలేషియా మహిళ గురువారం అదృశ్యమైంది. వివరాలు.. మలేషియా షాంగై పట్టానికడా, తామన్‌డేసాజయా ప్రాంతానికి చెందిన శివనేశన్ (34) వంటపని చేస్తుంటారు. ఇతని భార్య భువన (34) కొరియర్ సంస్థ కార్యాలయంలో పనిచేస్తోంది. పదేళ్ల క్రితం వారికి వివాహమై ప్రగతి (9), జనని (6) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. భార్యాభర్తలు తమిళనాడులో పర్యటించేందుకు 2వ తేదీన మలేషియా నుంచి విమానం ద్వారా చెన్నై చేరుకున్నారు. చెన్నైలోనే బసచేసి అనేక ఆలయాలను సందర్శించారు. 8వ తేదీన ఊటీ వెళ్లేందుకు రాత్రి 11.30 గంటల సమయంలో మేట్టుపాళయం చేరుకున్నారు. అక్కడున్న ఒక లాడ్జిలో రూం తీసుకుని బస చేశారు. గురువారం ఉదయం శివనేశన్ నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు. అన్ని చోట్ల వెదికినా ఆచూకీ లభించలేదు. ఆమె లాడ్జి గది నుంచి హ్యాండ్ బ్యాగ్, పాస్‌పోర్టు, సెల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు తెలిసింది. సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. ఫిర్యాదు మేరకు మేట్టుపాళయం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో భువన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో భువన కాల్వ ప్రిక్వార్టర్స్‌కు చేరుకోగా, సామ సాత్విక తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భువన 6–3, 6–3తో ప్రేరణ బాంబ్రీపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో సామ సాత్విక 6–4, 3–6, 1–6తో ధ్రుతి వేణుగోపాల్ చేతిలో ఓడిపోయింది. డబుల్స్ విభాగంలో సామ సాత్విక–రిషిక సుంకర జోడీలు క్వార్టర్స్‌కు చేరుకోగా... నిధి చిలుముల, షేక్ హుమేరా బేగం, సాయిదేదీప్య, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జంటలు ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సామ సాత్విక–జెన్నిఫర్ (భారత్) జంట 7–6 (7/5), 6–2తో షేక్ హుమేరా బేగం–సౌమ్య జోడీపై, రిషిక సుంకర–శ్వేత చంద్ర (భారత్) ద్వయం 6–1, 7–5తో సాయిదేదీప్య–సారా యాదవ్ (భారత్) జంటపై గెలుపొందాయి. శ్రీవల్లి రష్మిక–మౌలిక రామ్ జంట 2–6, 4–6తో హెర్డ్‌జెలస్ డియా (బోస్నియా)–సు చింగ్ వెన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రీ–నిధి జంట 4–6, 0–6తో రియా–స్నేహాదేవి జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్‌లో భువన, సాత్విక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, సామ సాత్విక సెమీఫైనల్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ముందంజ వేయగా, నగరానికే చెందిన షేక్ హుమేరా, శ్రావ్య శివానిలు పరాజయం పాలయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భువన (తెలంగాణ) 0–6, 6–4, 6–3తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)ను బోల్తా కొట్టించగా... షేక్ హుమేరా (తెలంగాణ) 2–6, 4–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు అండర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సామ సాత్విక (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో ప్రేరణ విచారే (మహారాష్ట్ర)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకోగా, శ్రావ్య శివాని (తెలంగాణ) 2–6, 1–6తో తనీషా కశ్యప్ (అస్సాం) చేతిలో, షేక్ హుమేరా (తెలంగాణ) 1–6, 3–6తో వైదేహి చౌదరి (గుజరాత్) చేతిలో పరాజయం పాలయ్యారు. టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడి ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాయాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో దేదీప్య–సారాయాదవ్ ద్వయం 6–4, 6–1తో సోహా–సృష్టి జంటపై విజయం సాధించింది. ఫైనల్లో సాయిదేదీప్య జోడి స్నేహా రెడ్డి (తమిళనాడు)–శ్వేతా రాణా (ఢిల్లీ) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో షేక్ హుమేరా, భువన
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, షేక్ హుమేరా నిలకడగా రాణిస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భువన కాల్వ (తెలంగాణ) 6–2, 6–4తో మూడో సీడ్ శ్వేత రాణా (ఢిల్లీ)ను కంగుతినిపించింది. మరో మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్ 0–6, 0–6తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అండర్–18 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ షేక్ హుమేరా (తెలంగాణ) 6–1, 6–2తో ప్రింకెల్ సింగ్ (జమ్ము, కశ్మీర్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హుమేరాతో పాటు రాష్ట్రానికి చెందిన శ్రావ్య శివాని, సామ సాత్విక క్వార్టర్స్‌కు చేరుకోగా సాయిదేదీప్యకు చుక్కెదురైంది. శ్రావ్య శివాని 6–0, 6–1తో భక్తి పర్వాని (గుజరాత్)పై, పదమూడో సీడ్ సామ సాత్విక 6–2, 6–3తో నాలుగో సీడ్ సల్సా అహెర్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 2–6, 2–6తో ప్రేర ణ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య సింగిల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ డబుల్స్‌లో దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 7–5, 4–6, 10–6తో అక్షర ఇస్కా– మౌలిక రామ్ (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ సృష్టి దాస్ (మహారాష్ట్ర)–సోహా (కర్ణాటక) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో భువన
గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో క్వాలిఫయర్ భువన 6–2, 6–3తో మూడో సీడ్, హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టిపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రాంజల 5–7, 6–7 (5/7)తో టాప్ సీడ్ ఫాత్మా అల్ నభాని (ఒమన్) చేతిలో... పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి రెడ్డి 1–6, 3–6తో మెహక్ జైన్ (భారత్) చేతిలో ఓడిపోయారు. డబుల్స్ క్వార్టర్స్‌లో నిధి చిలుముల–ప్రేరణ జంట 7–6 (7/4), 4–6, 10–6తో రష్మీ –ఇతీ మెహతా (భారత్) జోడీపై నెగ్గింది. -
భువన, సౌజన్య శుభారంభం
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ గ్వాలియర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు అమ్మా యిలు భువన కాల్వ, సౌజన్య భవిశెట్టి శుభారంభం చేశారు. ఇక్కడి సిటీ సెంటర్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్లో భువన 7–5, 6–4తో అలెగ్జాండ్ర వాల్టర్స్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, మూడో సీడ్ సౌజన్య 6–1, 6–1తో భారత్‌కే చెందిన యువరాణి బెనర్జీపై అలవోక విజయం సాధించింది. శివిక బర్మన్తో జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి 4–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగింది. దీంతో శ్రీవైష్ణవి ముందంజ వేసింది. డబుల్స్ విభాగంలో నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 6–0, 6–2తో హర్షిత–హిమాని మోర్ జంటపై విజయం సాధించింది. గువాహటిలో జరుగుతున్న ఐటీఎఫ్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట 3–6, 6–3, 5–10తో మాటెస్జ్ టెర్జిన్స్కీ (పోలండ్)– జోస్కో విడలజారిన్ (స్పెయిన్) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. -
పదసౌకమార్యం... పారిజాతాప హరణం
భావ పరిమళాల జల్లు భువన విజయం సాహితీ ప్రసంగంలో డాక్టర్ రాఘవేంద్రరావు రాజమహేంద్రవరం కల్చరల్ : శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరైనంది తిమ్మన రచించిన పారిజాతాపహరణ ప్రబంధాన్ని భామా విజయంగా, సత్యభామా విజయంగా పేర్కొనవచ్చునని రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.వి.రాఘవేంద్రరావు తెలిపారు. నన్నయ వాజ్మయ వేదిక, పద్యసారస్వత పరిషత్, జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న భువన విజయ సాహితీ ప్రసంగ పరంపరలలో భాగంగా, సోమవారం ఆయన పారిజాతాపహరణంపై ప్రసంగించారు. పదసౌకుమార్యానికి, భావ పరిమళాలకు నంది తిమ్మన రచన అచ్చంగా పారిజాతమేనని ఆయన అభివర్ణించారు. 'అల్లసానివారి’ అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్యుని ముద్దుపలుకు, పాండురంగవిభుని పదగుంభనంబు' అని ఒక చాటువు ఆయా కవులరచనా విశిష్టతను తెలియచేస్తున్నదని రాఘవేంద్రరావు తెలిపారు. తెలుగు సాహిత్యంలో పదిమంది అగ్రప్రబంధ నాయకులలో సత్యభామ ఒకరన్నారు. ఆభిజాత్యం, అభిమానం, ఆత్మీయత, కోరికను సాధించుకునే పట్టుదలలో ఆమెకు ఆమే సాటి అని ఆయన చెప్పారు. ఐదు ఆశ్వాసాలలో, 512 పద్యగద్యాలలో నందితిమ్మన పారిజాతాపహరణం ప్రబంధాన్ని విరచించాడని, హరివంశంలో ఒక చిన్న కథ దీనికి ఆధారమని ఆయన తెలిపారు. ఆంధ్ర సాహిత్యంలో మూడు ప్రసిద్ధి చెందిన ఏడుపు పద్యాలు ఉన్నాయని చెప్పారు. అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధిని అల్లిబిల్లిగా ఏడ్చింది. భట్టుమూర్తి వసుచరిత్రలో గిరికాదేవి బావురుమని ఏడ్చింది. నందితిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ ముద్దుముద్దుగా ఏడిచిందని ఆయన పేర్కొన్నారు. పద్యాలను రాగ, భావయుక్తంగా ఆలపించి రాఘవేంద్రరావు సాహిత్యాభిమానులను ఆకట్టుకున్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాగౌతమి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ తెలుగుభాషను బతికిస్తున్నది ప్రవాసాంధ్రులు, విదేశాలలో ఉన్న తెలుగువారేనని తెలిపారు. పారిజాతాపహరణంలో నిజమైన గెలుపు సత్యభామది కాదని, రుక్మిణిదేనని ఆయన చెప్పారు. చింతలపాటి శర్మ, జోరా శర్మ, మంగళంపల్లి పాండురంగ విఠల్ తదితరులు హాజరయ్యారు. నేటి భువన విజయంలో అందరూ మహిళలే అమలాపురానికి చెందిన ద్విశతావధానిని ఆకెళ్ళ బాలభాను మొల్లరామాయణంపై మంగళవారం ప్రసంగిస్తారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథులంతా మహిళలే కావడం విశేషం -
డ్రైవర్ నిర్లక్ష్యం..బస్సు కిందపడి చిన్నారి మృతి
స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈసంఘటన రాజాపేట మండలం రేనికుంటలో జరిగింది. చిన్నారి ఇంటి దగ్గర స్కూలు బస్సు దిగుతుండగా బ్యాగు బస్సు డోర్‌కు తగులుకుంది. ఇది గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చిన్నారిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన చిన్నారి భువన(5) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు'
-
భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు: తలసాని
♦ వివరణ లేకుండా వార్తలు రాస్తారా? ♦ విలేకరులతో మంత్రి తలసాని ♦ భువన, ఆమె తల్లిదండ్రులతో కలసి మీడియా సమావేశం హైదరాబాద్: ‘మంత్రులకు కుటుంబం ఉం డదా.. మేం మనుషులం కాదా? బయట జరిగే సంఘటనలను మాకు ఆపాదిస్తే ఎలా? మీడి యా సంస్థల అధిపతులు, వారి కుటుంబ సభ్యులు తప్పతాగి హోటళ్లలో ఉండి సమస్య ల్లో ఇరుక్కుంటే ఆదుకున్న సందర్భాలు లే వా?’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తన కుమారునిపై కేసు నమోదు కు సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయన టెన్నిస్ క్రీడాకారిణి భువన, ఆమె తల్లిదండ్రు లు శ్రీలత, మహేంద్రనాథ్రెడ్డిలతో కలసి ఆది వారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రేమ వివాహం చేసుకున్న భువనను ఆమె భర్త అభినవ్ వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పుకుంది. అభినవ్ ఆమె పుట్టింటికి వచ్చి గొడవచేసి మహేంద్రనాథ్‌పై దాడి చేశాడు. సమస్యను నాకు చెప్పుకునేం దుకు వచ్చారు. ఆ సమయంలో నేను అందుబాటులో లేకపోవడంతో నా కుమారుడు సమస్య అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అభినవ్ వారిపై దాడిచేశాడు. అక్కడే ఉన్న కొందరు అనుచరులు గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించి సాయికిరణ్ అనే వ్యక్తి పేరిట కేసు నమోదైతే అంతా మంత్రి కుమారుడిపై కేసు నమోదైనట్లు రాయడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ఓ అమ్మాయికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపాల్సిన మీడియా.. ఆ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేయడం తగదన్నారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందంటూ అభినవ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో కొన్ని పత్రికలు తన పేరును అనవసరంగా జోడించి, ఆ తర్వాత నిజాలు తెలుసుకుని క్షమాపణ చెప్పడాన్ని ఆయన ఉదహరించారు. అభినవ్‌పై కేసు నమోదు భువన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీసుస్టేషన్లో అభివన్పై ఆదివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన భువనారెడ్డి ఈ ఏడాది మేలో అభినవ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి వెళ్లనీయకుండా ఇంటికి పరిమితం చేశాడని తన భర్తపై భువనారెడ్డి ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి ఫోన్ చేసి కూమార్తెను ఇంటికి పంపించాలని కోరిన సమయంలో రూ.3 కోట్లు ఇస్తేనే పంపిస్తానని డిమాండ్ చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే మొదట పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడని పేర్కొంది. ఈ మేరకు అభినవ్‌పై అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినందుకు 498ఏ, మొదటి పెళ్ళి విషయాన్ని దాచి రెండో వివాహం చేసుకున్నందుకు 195 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తలసాని కుమారుడి కేసులో కీలక మలుపు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభినవ్-భువన వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమ విషయంలో జోక్యం చేసుకొని మంత్రి తలసాని కొడుకు దాడి చేశాడని అభినవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అభినవ్ భార్య భువన కీలక వివరణ ఇచ్చింది. అసలు అభినవే తనను ఇబ్బందులకు గురిచేశాడని, తన తండ్రిని విపరీతంగా కొట్టాడని చెప్పింది. తలసాని కుమారుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో స్వయంగా మంత్రి తలసాని ఈ విషయంలో జోక్యం చేసుకొని భువనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు వివరాలను చెప్పింది. తాను అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి అని, జిమ్ కు వెళ్లే సమయంలో తనకు అభినవ్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం పెరిగిందని, ఈ లోగా ఓ మ్యాచ్‌లో తాను ఓడిపోవడంతో తండ్రి తిట్టాడని ఆ సమయంలో తనను అభినవ్ వాళ్లింటికి వచ్చేయమని చెప్పడంతో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా వెళ్లానని, ఆ మరుసటి రోజే వివాహం చేసుకున్నామని వివరించింది. ఆ విషయం రెండు రోజుల్లో తన తండ్రికి చెప్పడంతో పెద్ద కూతురు పెళ్లి కావాల్సి ఉన్నందున ఇప్పుడప్పుడే తొందరపడి బయటకు చెప్పొద్దని వచ్చే ఏడాది పెళ్లి జరిపిస్తామని చెప్పాడని పేర్కొంది. ఐదు నెలలుగా తాను తన తండ్రి వద్దే ఉంటున్నానని, 20 రోజుల కిందటే అభినవ్ వద్దకు వెళ్లానని ఈ 20 రోజుల్లోనే అతడి అసలు స్వరూపం బయటపడిందని చెప్పింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను ఆడనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడని, బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి డోర్ వేసి వెళ్లిపోయేవాడని, కాలేజీ కూడా లేకుండా చేశాడని వాపోయింది. ప్రతి రోజూ చిత్ర హింసలు పెట్టేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపించింది. తన అక్కకు పెళ్లి చూపులు కావడంతో తీసుకెళ్లేందుకు వచ్చిన తన తండ్రితో పంపించేందుకు ఒప్పుకోలేదని రూ.మూడు కోట్లు డిమాండ్ చేశాడని, అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఎంత ప్రాపర్టీ ఉంటే అంత అభినవ్ పేరు మీద రిజిష్టర్ చేయాలని డిమాండ్ చేశాడని చెప్పింది. తర్వాత ఏం మాట్లాడుకున్నారో.. అక్టోబర్ 24 రాత్రి తనను ఇంట్లో దింపేసి వెళ్లాడని, రెండు రోజులు అక్కడే ఉండాల్సిన తనను ఉన్నపలంగా ఇంటికొచ్చేయమన్నాడని తాను కూడా అందుకు సిద్ధమయ్యానని చెప్పింది. ఇంతలో మరో రోజు అభినవ్ వచ్చి గొడవ పెట్టుకొని తన తండ్రి మహేందర్ రెడ్డిని తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తన తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అనంతరం అబినవ్, భువన తండ్రి మహేందర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణను మంత్రి తలసాని మీడియాకు వినిపించారు. -
జస్టిస్ రమణ కుమార్తెకు కేసీఆర్ ఆశీస్సులు
హైదరాబాద్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తె భువనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందచేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె వివాహ నిశ్చితార్థం జరగనుంది. కాగా కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే .. ఎస్ఆర్ నగర్‌లోని ఎన్వీ రమణ ఇంటికి వెళ్లి భువనకు తన ఆశీస్సులు అందచేశారు. కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎం రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. కాగా ఈ రోజు నగరంలోని దసపల్లా హోటల్ లో జరిగిన భువన నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు... భువనను ఆశీర్వదించారు. -
భువనకు తొలి ఐటీఎఫ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వర్థమాన టెన్నిస్ తార కాల్వ భువన కెరీర్లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. న్యూఢిల్లీలో శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో 18 ఏళ్ల భువన విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్ భువన 6-4, 7-5తో ఆరో సీడ్ అకారి ఇనౌ (జపాన్)పై సంచలన విజయం సాధించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ అంకిత రైనా (భారత్)పై 6-3, 6-2తో నెగ్గిన ఈ తెలుగు అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో 7-5, 6-4తో నటాషా పల్హా (భారత్)ను ఓడించింది. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల ప్రాంతానికి చెందిన భువన రెండో రౌండ్లో 6-1, 6-4తో శివిక బర్మన్ (భారత్)పై; తొలి రౌండ్లో 6-1, 3-6, 6-1తో మూడో సీడ్ కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలిచింది.