జస్టిస్ రమణ కుమార్తెకు కేసీఆర్ ఆశీస్సులు | cm kcr wish to Justice NV Ramana daughter bhavana | Sakshi
Sakshi News home page

జస్టిస్ రమణ కుమార్తెకు కేసీఆర్ ఆశీస్సులు

Published Sat, Dec 6 2014 12:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

జస్టిస్ రమణ కుమార్తెకు కేసీఆర్ ఆశీస్సులు - Sakshi

జస్టిస్ రమణ కుమార్తెకు కేసీఆర్ ఆశీస్సులు

హైదరాబాద్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తె భువనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందచేశారు. శనివారం హైదరాబాద్లో ఆమె వివాహ నిశ్చితార్థం జరగనుంది.  కాగా కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుక్రవారమే .. ఎస్ఆర్ నగర్లోని ఎన్వీ రమణ ఇంటికి వెళ్లి భువనకు తన ఆశీస్సులు అందచేశారు. కేసీఆర్తో పాటు డిప్యూటీ సీఎం రాజయ్య, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు.

 

కాగా ఈ రోజు నగరంలోని దసపల్లా హోటల్ లో జరిగిన  భువన నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు... భువనను ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement