భువనకు తొలి ఐటీఎఫ్ టైటిల్ | Bhuvana received First ITF title | Sakshi
Sakshi News home page

భువనకు తొలి ఐటీఎఫ్ టైటిల్

Published Sun, Sep 1 2013 2:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

Bhuvana received First ITF title

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వర్థమాన టెన్నిస్ తార కాల్వ భువన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. న్యూఢిల్లీలో శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో 18 ఏళ్ల భువన విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్ భువన 6-4, 7-5తో ఆరో సీడ్ అకారి ఇనౌ (జపాన్)పై సంచలన విజయం సాధించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ అంకిత రైనా (భారత్)పై 6-3, 6-2తో నెగ్గిన ఈ తెలుగు అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో 7-5, 6-4తో నటాషా పల్హా (భారత్)ను ఓడించింది. వైఎస్‌ఆర్ జిల్లాలోని పులివెందుల ప్రాంతానికి చెందిన భువన రెండో రౌండ్‌లో 6-1, 6-4తో శివిక బర్మన్ (భారత్)పై; తొలి రౌండ్‌లో 6-1, 3-6, 6-1తో మూడో సీడ్ కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement