ITF title
-
శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో తెలంగాణ క్రీడాకారులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక ముందంజ వేశా రు. పోర్చుగల్‌లోని పల్మెలా వేదికగా సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో వీరిద్దరూ గెలుపొందారు. శ్రీవల్లి రష్మిక 4–6, 6–3, 13–10తో కింబర్లీ పుకుసా (బ్రిటన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ సాత్విక 6–3, 6–1తో బెట్రిజ్ పసిలెట్టి డ్యూర్టె కోస్టా (పోర్చుగల్)ను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అనా ఫిలిపా సాంటోస్ (పోర్చుగల్)తో సాత్విక, మూడో సీడ్ వాలెంటినా ఇవనోవ్ (న్యూజిలాండ్)తో శ్రీవల్లి రష్మిక ఆడతారు. -
భువనకు తొలి ఐటీఎఫ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వర్థమాన టెన్నిస్ తార కాల్వ భువన కెరీర్లో తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. న్యూఢిల్లీలో శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో 18 ఏళ్ల భువన విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్‌సీడెడ్ భువన 6-4, 7-5తో ఆరో సీడ్ అకారి ఇనౌ (జపాన్)పై సంచలన విజయం సాధించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ అంకిత రైనా (భారత్)పై 6-3, 6-2తో నెగ్గిన ఈ తెలుగు అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో 7-5, 6-4తో నటాషా పల్హా (భారత్)ను ఓడించింది. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల ప్రాంతానికి చెందిన భువన రెండో రౌండ్లో 6-1, 6-4తో శివిక బర్మన్ (భారత్)పై; తొలి రౌండ్లో 6-1, 3-6, 6-1తో మూడో సీడ్ కెరెన్ ష్లోమో (ఇజ్రాయెల్)పై గెలిచింది.