
భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు: తలసాని
‘మంత్రులకు కుటుంబం ఉం డదా.. మేం మనుషులం కాదా? బయట జరిగే సంఘటనలను మాకు ఆపాదిస్తే ఎలా? మీడి యా సంస్థల అధిపతులు, వారి కుటుంబ సభ్యులు
♦ వివరణ లేకుండా వార్తలు రాస్తారా?
♦ విలేకరులతో మంత్రి తలసాని
♦ భువన, ఆమె తల్లిదండ్రులతో కలసి మీడియా సమావేశం
హైదరాబాద్: ‘మంత్రులకు కుటుంబం ఉం డదా.. మేం మనుషులం కాదా? బయట జరిగే సంఘటనలను మాకు ఆపాదిస్తే ఎలా? మీడి యా సంస్థల అధిపతులు, వారి కుటుంబ సభ్యులు తప్పతాగి హోటళ్లలో ఉండి సమస్య ల్లో ఇరుక్కుంటే ఆదుకున్న సందర్భాలు లే వా?’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తన కుమారునిపై కేసు నమోదు కు సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయన టెన్నిస్ క్రీడాకారిణి భువన, ఆమె తల్లిదండ్రు లు శ్రీలత, మహేంద్రనాథ్‌రెడ్డిలతో కలసి ఆది వారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రేమ వివాహం చేసుకున్న భువనను ఆమె భర్త అభినవ్ వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పుకుంది.
అభినవ్ ఆమె పుట్టింటికి వచ్చి గొడవచేసి మహేంద్రనాథ్‌పై దాడి చేశాడు. సమస్యను నాకు చెప్పుకునేం దుకు వచ్చారు. ఆ సమయంలో నేను అందుబాటులో లేకపోవడంతో నా కుమారుడు సమస్య అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అభినవ్ వారిపై దాడిచేశాడు. అక్కడే ఉన్న కొందరు అనుచరులు గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించి సాయికిరణ్ అనే వ్యక్తి పేరిట కేసు నమోదైతే అంతా మంత్రి కుమారుడిపై కేసు నమోదైనట్లు రాయడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ఓ అమ్మాయికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపాల్సిన మీడియా.. ఆ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేయడం తగదన్నారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందంటూ అభినవ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో కొన్ని పత్రికలు తన పేరును అనవసరంగా జోడించి, ఆ తర్వాత నిజాలు తెలుసుకుని క్షమాపణ చెప్పడాన్ని ఆయన ఉదహరించారు.
అభినవ్‌పై కేసు నమోదు
భువన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీసుస్టేషన్‌లో అభివన్‌పై ఆదివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన భువనారెడ్డి ఈ ఏడాది మేలో అభినవ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి వెళ్లనీయకుండా ఇంటికి పరిమితం చేశాడని తన భర్తపై భువనారెడ్డి ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి ఫోన్ చేసి కూమార్తెను ఇంటికి పంపించాలని కోరిన సమయంలో రూ.3 కోట్లు ఇస్తేనే పంపిస్తానని డిమాండ్ చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే మొదట పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడని పేర్కొంది. ఈ మేరకు అభినవ్‌పై అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినందుకు 498ఏ, మొదటి పెళ్ళి విషయాన్ని దాచి రెండో వివాహం చేసుకున్నందుకు 195 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.