Minister Talasani Srinivas yadav
-
మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!
సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు. ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోనూ... హైదరాబాద్ ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్ పోలీసులు తెలిపారు. కార్యాలయం వాచ్మెన్ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్సీఈఆర్టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
దేశానికి అత్యధిక రెవెన్యూ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
-
ఐమాక్స్‌లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తలసాని
-
ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని
Minister Talasani Srinivas Speech At Sammathame Pre Release Event: ‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు.. కానీ, ప్రతిభ ఉంటే ఇంటి వద్ద ఉన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ‘సమ్మతమే’ సినిమా హిట్ కావాలి.. సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో శుక్రవారం (జూన్ 24) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సమ్మతమే’ ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో విషయం ఉందనిపించింది. యంగ్ టీమ్ కలిసి ధైర్యంగా తీసిన ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సమ్మతమే’ని గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం కిరణ్. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘సమ్మతమే’ సినిమా నా ఒక్కరిదే కాదు.. ఇక్కడికొచ్చిన మీ అందరిదీ. ఈ చిత్రాన్ని హిట్ చేయాలి’’ అన్నారు కంకణాల ప్రవీణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నిర్మాత ‘బన్నీ’ వాసు తదితరులు పాల్గొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
మర్డర్ మిస్టరీ 'కిరోసిన్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని
Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer: ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందానికి మంత్రి తలసాని ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉందన్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృధ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ గవర్నర్ పై తలసాని సంచలన వ్యాఖ్యలు
-
ఐదో ఆటకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: సినిమా థియేటర్లలో ఐదోఆటను ప్రదర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పారదర్శకత కోసం త్వరలో ఆన్లైన్లో టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ ఎగ్జిబిటర్ల సమస్యలపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రైవేటు వెబ్సైట్లు ఒక్కో టికెట్ విక్రయానికి రూ.20 నుంచి రూ.40 వరకు సర్వీసుచార్జి వసూలు చేస్తుండగా, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి కేవలం రూ.6 మాత్రమే సర్వీసుచార్జి ఉంటుందని పేర్కొన్నారు. సినీ థియేటర్లు మూసేసిన లాక్డౌన్ కాలానికి సంబం ధించిన విద్యుత్‌చార్జీలు, ఆస్తిపన్ను రద్దు వంటి పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేయగా, ఇప్పటికే అనుమతిచ్చామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహించుకోవడానికి కూడా అనుమతించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాల(24 క్రాఫ్ట్స్) కార్మికులకోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, సెక్రెటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, సెక్రెటరీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
మూడు నెలలు థియేటర్లు మూత
కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి, థియేటర్స్ మూత పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇకౖపై కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులను అలవాటు చేసుకోవాలని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మరి... ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్‌ను మళ్లీ ఓపెన్ చేయడమనే విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. (నాడు మోసం.. నేడు మౌనం!) ‘‘ఈ పరిస్థితుల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేస్తే సమస్యలు వస్తాయి. ఒకవేళ థియేటర్స్‌ను ఓపెన్ చేసినప్పటికీ కరోనా భయంతో ప్రేక్షకులు రాకపోవచ్చు. అలాగే సామాజిక దూరం పాటించడం కోసం థియేటర్స్‌లోని సీటింగ్ విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సీటింగ్ విషయంలో వీలైనంత త్వరగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. కానీ జిల్లా స్థాయి థియేటర్స్‌లో సీటింగ్‌లో మార్పులు చేస్తే వారు ఆర్థికంగా ఇబ్బందిపడొచ్చు. ప్రస్తుతానికైతే మరో రెండు నుంచి మూడు నెలలపాటు థియేటర్స్‌ను రీ ఓపెన్ చేయడం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేదు. కొన్ని షరతులతో థియేటర్స్ ఓపెన్ చేయమని కొందరు అంటుంటే మరికొందరు కొంత కాలం వేచి చూద్దాం అంటున్నారు. అలాగే షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం పట్ల కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు తలసాని శ్రీనివాస యాదవ్. సో.. మరో మూడు నెలల వరకూ థియేటర్ల మూత ఖాయం అనుకోవచ్చు. -
బోనాల పండగలో మంత్రి తలసాని సెప్పులు
-
ఘనంగా లష్కర్ బోనాల సంబరాలు
-
సబ్సిడీపై 2.13 లక్షల పాడి పశువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2.13 లక్షల మంది పాడిరైతులకు సబ్సిడీపై గేదెలు, ఆవుల పంపిణీని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయ, కరీంనగర్, ముల్కనూర్, మదర్ డెయిరీలకు పాలు పోస్తున్న 2.13 లక్షల మంది రైతులకు సబ్సిడీపై పాడిగేదెలు, పాడి ఆవులను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఒక్కో పాడిగేదెకు రూ. 80 వేలు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీని వర్తింప చేస్తామని పేర్కొన్నారు. మొదటగా 15 వేల మంది లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేస్తామని, ప్రతినెలా 15 వేల నుండి 16 వేల పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ గేదెలను హర్యానా, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆయా రాష్ట్రాలలో గేదెల లభ్యత, నాణ్యతను పరిశీలించేందుకు డెయిరీల ప్రతినిధులు, అధికారులు, రైతులతో కూడిన బృందాలు పర్యటించినట్లు వివరించారు. రైతుల ఇష్టాఇష్టాలపై ఆధారపడే విధంగా పాడిగేదెల కొనుగోలు పథకం నిబంధనలు రూపొందిస్తామన్నారు. పశువుల కొనుగోలు విధివిధానాలను 2.13 లక్షల మంది సభ్యులకు తెలుగులో కరపత్రం రూపంలో ముద్రించి అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బల్క్‌మిల్క్ చిల్లింగ్ సెంటర్ల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు అధికారులు స్థానిక డెయిరీతో కూడిన 300 బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాడిగేదెల కొనుగోళ్లకు వెళ్లే లబ్ధిదారుల ఎంపిక తదితర బాధ్యతలను ఆయా డెయిరీ ఫెడరేషన్ చైర్మన్లు చేపట్టాలని మంత్రి సూచించారు. విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఇతర డెయిరీల చైర్మన్లతో సమన్వయం చేస్తారన్నారు. కొనుగోలు చేసిన ప్రతి గేదెకు తప్పనిసరిగా బీమా చేస్తామని తలసాని చెప్పారు. ఇప్పటికే పాడిరైతులను ప్రోత్సహించేందుకు లీటర్ పాలకు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకోవాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ.. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని విలీన గ్రామాల్లో నివసిస్తున్న గొల్ల, కురుమలకు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, వనపర్తి, కొల్హాపూర్ల్లో నివసిస్తున్న వారికి పంపిణీ చేయడానికి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా మంత్రి తలసాని ఆదేశించారు. గతేడాది జూన్ 20వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు రూ. 3,700 కోట్లతో 65 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు చెప్పారు. -
పది రోజుల్లో 459 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో 459 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. పశువైద్యశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాల ని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సంచార పశువైద్యశాలల నిర్వహణపై పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జీవీకే ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచార పశువైద్యశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.83 లక్షల తో కొత్తగా 20 మంది ఆపరేటర్లను నియమిస్తున్నా మన్నారు. 1962 టోల్‌ఫ్రీ నంబర్‌తో సంచార పశు వైద్యశాలల ద్వారా జీవాల వైద్యసేవల కోసం 10 మంది ఆపరేటర్లను నియమించుకున్నామని, దీని ద్వారా ప్రతిరోజూ 1,400 కాల్స్ వస్తున్నాయని, ఇందులో 500 ఫిర్యాదులపై స్పందించి అవసరమైన జీవాలకు వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ సేవలు పెంపు 20 మంది ఆపరేటర్ల సేవలను వచ్చే నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సామర్థ్యం పెంపుతో నిత్యం 5 వేల కాల్స్‌ను తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం 1962 సేవలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందిస్తున్నామని, వీటిని ఉదయం 7కి ప్రారంభించి సాయం త్రం 5 వరకు కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిపారు. 1962 వ్యవస్థను నిత్యం పర్యవేక్షించేందుకు తమ కార్యాలయంతో పాటు పశుసంవర్థకశాఖ కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని నియమించి ఒక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించానన్నారు. 100 సంచార పశువైద్యశాలలకు అదనంగా మరో 100 వాహనాల కొనుగోలుకు బడ్జెట్ కేటా యించాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. -
‘ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల ఎంపికలో లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మత్స్య, పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ‘చేపా.. చేపా.. నీకేమైంది’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దీనిపై మత్స్యశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. పత్రికలో పేర్కొన్న ప్రాంతాలకు ఉన్నతాధికారులను పంపి, వాస్తవ పరిస్థి తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీని ఆధారంగా.. చేప పిల్లల ఎంపికలో ఏవైనా లోపాలుంటే.. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు 140 చేపల మార్కెట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, అందులో 40 మార్కెట్లకు స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. చేపల విక్రయాల కోసం విస్తృతమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తాం..
సాక్షి, నల్లగొండ : మత్స్యకారుల కుటుంబాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం జిల్లాలోని డిండిలో సమావేశమయ్యారు. అంతేకాక చేపల పెంపకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులు గ్రామాల్లో సంతోషంగా జీవిస్తారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అందరికి ప్రోత్సహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతం అయిందని తెలిపారు. వచ్చే వానకాలంలో మళ్ళీ గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలుపెడుతామని మంత్రి చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అయ్యారు. వొచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ వారు పుట్టగతులు లేకుండా పోతారని జోస్యం మంత్రి తలసాని జోస్యం చెప్పారు. -
నాయినికి ‘లోహియా’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు. అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు గొర్రెలకు ఉచిత దాణా
సాక్షి, హైదరాబాద్: వేసవిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు రూ.66 కోట్లతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.53 లక్షల మందికి 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే కాకుండా వాటికి దాణా, నీరు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. యూనిట్‌కు 4 బస్తాల దాణా అందిస్తామన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించామని, చనిపోయిన వాటి వివరాలను అధికారులకు తెలియజేస్తే క్లెయి మ్స్ చెల్లిస్తారన్నారు. గొర్రెల పెంపకందారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.ఆరు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఆధునిక సౌకర్యాలతో గొర్రెల పెంపకంపై శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కోతలు ఇచ్చే మేలు రకపు పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీపై రైతులకు ఇస్తామన్నారు. వెయ్యి కోట్లతో మత్స్యశాఖ అభివృద్ధి: మత్స్యరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని వెల్లడించారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని వారిని ఆదేశించారు. మత్స్య విత్తన అభివృద్ధి పథకం కింద రూ.204 కోట్లతో హేచరీలు, విత్తన క్షేత్రాల బలోపేతం వంటివి చేపడుతున్నామన్నారు. చేపల వేట కోసం మత్స్యకారులకు రూ.82 కోట్లతో సబ్సిడీపై క్రాఫ్ట్‌లు, వలలను పంపిణీ చేస్తామన్నారు. రూ. 370 కోట్లతో చేపల మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలను చేపడతామన్నారు. 201718 సంవత్సరంలో 51 కోట్ల చేపపిల్లలను రూ.42 కోట్ల ఖర్చుతో 11,067 జలాశయాల్లో విడుదల చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ పాల్గొన్నారు. -
సినీ ధరల చెల్లింపు వివాదం పరిష్కరిస్తా
సాక్షి, హైదరాబాద్: క్యూబ్/యూఎఫ్‌వో సంస్థల నిర్వాహకులకు, సినీ ఎగ్జిబిటర్లకు ధరల చెల్లింపు వివాదాన్ని ఇరుపక్షాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్న క్యూబ్/యూఎఫ్‌వో సంస్థలు ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 2 నుంచి దక్షిణ భారతదేశంలో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నట్లు వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు, హిందీ సినిమాల పట్ల ఒకలా, హాలీవుడ్ చిత్రాల పట్ల మరోలా క్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్ల స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచితే తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చేలా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చలనచిత్ర పరిశ్రమకు కేసీఆర్ హయాంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ సినీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తలసాని వారికి తెలిపారు. సింగిల్ విండో విధానం, ఆన్లైన్ టికెటింగ్, పరిశ్రమలోని కార్మికులకు ఇళ్ల నిర్మాణంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. మంత్రిని కలసిన వారిలో ఫిల్మ్ చాంబర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సౌత్ ఇండియా నిర్మాతల సంఘం కార్యదర్శి సి.కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షులు జెమిని కిరణ్, దామోదర్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
నిధులిస్తున్నా.. అభివృద్ధి లేదేం?
సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోవడం విచారకరమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాల్లోనే విజయ పాలు, ఉత్పత్తులు లభించడం లేదన్న ఫిర్యాదులు అనేకం ఉన్నాయని మండిపడ్డారు. ముందుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, జాతీయ రహదారుల వెంట ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విజయ ఉత్పత్తులే వాడండి.. వివిధ పథకాల కింద డెయిరీకి నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తలసాని మండిపడ్డా రు. హోర్డింగ్‌లు, ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్వేస్టేషన్లు, టీవీలలో విస్తృతమైన ప్రచారం కల్పించాలన్నారు. విజయ ఉత్పత్తుల విక్రయానికి నూతనంగా వెయ్యి ఔట్లెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలకు విజయ ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం విజయ ఉత్పత్తులు మాత్రమే సరఫరా చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అధికారులకు విక్రయాలపై లక్ష్యాలు నిర్దేశించాలని ఆదేశించారు. విజయ ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రచారం కోసం ఒక ఏజెన్సీని నియమించుకునే విషయంపై కూడా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. రైతులతో నూతన సొసైటీల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరముందన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
మంత్రి తలసాని కారును ఢీకొట్టిన లారీ
-
తలసానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
కీసర: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించనున్న మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం కీసరలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రథమ వార్షిక వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. శామీర్‌పేట జంక్షన్ వద్ద మంత్రి కాన్వాయ్‌తోసహా రింగ్‌రోడ్డు ఎక్కారు. నర్సంపల్లి – యాద్గార్పల్లి మధ్య ముఖం కడుక్కునేందుకు కారును పక్కకు ఆపమని మంత్రి చెప్పడంతో డ్రైవర్ వాహనాన్ని ఎడమవైపునకు తీసుకున్నాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ మంత్రి కారును ఢీకొంది. దీంతో మంత్రి కూర్చున్న కారు కొద్దిగా ముందుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు తలసానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారు వెనుక భాగం మాత్రం దెబ్బతిన్నది. అయితే వెనుక సీటులో కూర్చున్న మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా మంత్రికారులోనే ఉన్నా, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. మంత్రి కారును ఢీకొట్టిన లారీని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించి, డ్రైవర్ రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ సురేందర్‌గౌడ్ తెలిపారు. దేవుడి దయతోనే బయటపడ్డా: తలసాని సాక్షి, హైదరాబాద్: దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే లారీ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ప్రమాద విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారని ఈ సందర్భంగా చెప్పారు. -
రేపటి నుంచే ‘పాల’ ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పాల సహకార సంఘాల్లోని రైతులకు ప్రోత్సాహకం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విజయ డెయిరీ రైతులకు అందజేస్తున్న తరహాలో లీటర్‌కు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా అందజేస్తామని, 24వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది. సచివాలయంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై శుక్రవారం తలసాని సమీక్ష నిర్వహించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, తెలంగాణ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, విజయ డెయిరీ ఎండీ నిర్మల, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు, ముల్కనూరు డెయిరీ చైర్మన్ విజయ, పశుసంవర్థకశాఖ అదనపు డైరెక్టర్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొ న్నారు. ఇతర డెయిరీలకు పాలు విక్రయించే రైతులకు ప్రోత్సాహకం చెల్లిస్తామన్న సీఎం హామీ మేరకు జీవో విడుదల చేశామని సమావేశం అనంతరం తలసాని తెలిపారు. 1.98 లక్షల మందికి ప్రయోజనం మదర్ డెయిరీకి పాలుపోస్తున్న 55 వేల మంది, ముల్కనూరు డెయిరీ పరిధిలోని 20 వేల మంది, కరీంనగర్ డెయిరీ పరిధిలోని 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. మొత్తంగా ప్రోత్సాహకంతో 1.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహకం సొమ్మును పాల బిల్లు చెల్లింపులతో పాటే లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తామని వెల్లడించారు. అలాగే ప్రోత్సాహకం పొందే రైతులకు సబ్సిడీపై పాడి గేదెలను అందిస్తామని, ఈ పథకంతో ప్రభుత్వంపై రూ.600 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొన్నారు. సబ్సిడీ గేదెలు పొందిన రైతులకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలనూ సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్ విజయ డెయిరీలో రూ.170 కోట్ల వ్యయంతో 4.50 లక్షల లీటర్ల సామర్థ్యంతో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. పాల పొడి ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా పాడిరంగం అభివృద్ధిలో గుత్తా సుఖేంద ర్‌రెడ్డికి ఎంతో అనుభవం ఉన్నందున.. ఆయన సలహాలు, సూచనలను స్వీకరించేందుకు ఈ సమావేశానికి ఆహ్వానించామన్నారు. రాజీనామాపై గుత్తా మౌనం నల్లగొండ ఎంపీ స్థానానికి రాజీ నామా చేసే అంశంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి మౌనం దాల్చారు. రైతు సమన్వయ సమితి రాష్ట్రస్థాయి సమన్వయకర్తగా గుత్తాను నియమించి కేబినెట్ ర్యాంకు ఇస్తారని.. తన ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా రాజీనామా అంశాన్ని ప్రస్తావించగా.. ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
300 కోట్లతో విజయ డెయిరీ ఆధునీకరణ
♦ మెగా డెయిరీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి తలసాని ♦ సంస్థ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీని రూ. 300 కోట్లతో ఆధునీకరించి మెగా డెయిరీగా అభివృద్ధి చేయనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ప్రైవేటు డెయిరీలకు దీటుగా ఉత్పత్తులు, విక్రయాలను పెంచేందుకు విజయ డెయిరీలో వచ్చే 6 నెలల్లో కీలక మార్పులు తెస్తామన్నారు. శనివారం విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సంస్థ ఎండీ నిర్మలతో కలసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ లాలాపేట్‌లోని డెయిరీ కేంద్రంలో రోజుకు 5 లక్షల లీటర్ల సామర్త్యంగల ప్లాంటు పనిచేస్తోందని, దీనికి అదనంగా మరో 5 లక్షల లీటర్ల సామర్థ్యంగల మరో ప్లాంట్‌ను ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేయనున్నట్లు తలసాని వివరించారు. ఇందుకోసం షామీర్పేట సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించామన్నారు. ప్రతి జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాల్లో విజయ డెయిరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై ప్రైవేటు సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించట్లేదు... విజయ పాలు, పాల ఉత్పత్తులకు రాష్ట్రంలో ఎంతో డిమాండ్ ఉందని, కానీ అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లే సంస్థ పనితీరు రోజురోజుకు దిగజారిపోతుందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణాలోపంతో విక్రయాల్లో వెనుకబడిందన్నారు. ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తున్నా ప్రైవేటు సంస్థలకంటే కూడా పాల సేకరణ, పాల ఉత్పత్తుల తయారీలో ఎంతో వెనుకబడిపోయామని అసహనం వ్యక్తం చేశారు. సంస్థ మనుగడ కోసం ముందుగా దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న అధికారులను తక్షణమే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. అధికారులకు టార్గెట్లు ఇవ్వాలని, జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకొని సమీక్షించాలని సూచించారు. రాజధానిలో మరో 100 ఔట్లెట్లు డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న వాటికి అదనంగా 100 ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో విజయ డెయిరీకి పాల సేకరణను పెంచేందుకు సొసైటీలను ఏర్పాటు చేయాలన్న తలసాని...ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో డెయిరీకి పాలు పోసే రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న 110 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. విజయ నెయ్యికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా ఈ సంవత్సరం అమ్మకాలు తగ్గాయని, ఇది సంస్థ మనుగడకు మంచిది కాదన్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు అవసరమైతే ప్రైవేటు డెయిరీలు ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్‌కు సమానంగా ఇవ్వాలన్నారు. -
దమ్ముందా.. నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా!
- మంత్రి తలసానికి షబ్బీర్ సవాల్ - పరుష పదజాలంతో విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత హైదరాబాద్: 'సిటీలో దిగ్విజయ్ ని తిరగనివ్వం' అన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. శనివారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీ తరఫున మంత్రిగా కొనసాగుతున్న నీకు దిగ్విజయ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మగాడివైతే, దమ్ముంటే ముందు రాజీనామాచేసిన తర్వాత మాట్లాడు..' అని మండిపడ్డారు. 'నకిలీ ఐసిస్ వెబ్ సైట్ కు సంబంధించి తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ చేసిన ఆరోపణలకు అయన వద్ద పూర్తి స్థాయి ఆధారాలు వున్నాయి. దిగ్విజయ్ ని హైద్రాబాద్ లో కాలు పెట్టనీయనని తలసాని అంటున్నారు. ఆయనకు సవాలు విసురుతున్నా. దిగ్విజయ్ హైదరాబాద్ రాగానే నీ(తలసాని) ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ పెడతా. దమ్ముంటే అడ్డుకో..' అని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్సిటీగా మార్చారని, సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ అభివృద్ధి అంతా మాటల్లోనే చూపుతున్నారని, చేతలు మాత్రం శూన్యమని షబ్బీర్ విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నగరంలో ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేదని, అధికార పార్టీ నాయకుల వేధింపుల కారణంగా నగరంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నాయని షబ్బీర్ అలీ ఆరోపించారు. -
చిన్న సినిమా... పెద్ద విజయం
‘‘చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విధానాలను అమలుచేస్తోంది. చారిత్రాత్మక చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో విజయం అందుకున్న దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సప్తగిరి, రోషిణి జంటగా అరుణ్‌పవార్ దర్శకత్వంలో డాక్టర్ కె. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అర్ధ శతదినోత్సవ వేడుకలో తలసాని పాల్గొన్నారు. రవికిరణ్ మరిన్ని సక్సెస్‌పుల్ చిత్రాలను తీయాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆకాంక్షించారు. ‘‘చిన్న చిత్రమైనా పెద్ద విజయం అందుకున్నాం. సప్తగిరితో మరో చిత్రం చేయనున్నాం. మా బ్యానర్ తరఫున సప్తగిరికి కారును బహుమతిగా ఇవ్వనున్నాం’’ అన్నారు రవికిరణ్. సప్తగిరి, రోషిణి, అరుణ్ పవార్, తదితరులు పాల్గొన్నారు. -
దాసరి ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు
-
బెదిరింపుల కేసులో టీడీపీ నేత అరెస్ట్
మారేడుపల్లి: హత్య కేసులో సాక్షులను బెదిరించి కిడ్నాప్‌కు పాల్పడినందుకు సికింద్రాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత బద్రీ యాదవ్‌ను మారేడుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ ఉమామహేశ్వర్ రావు కథనం ప్రకారం.. మారేడుపల్లిలో 2012లో శేఖర్ అనే స్థానికుడు రౌడీషీటర్స్ చేతిలో హత్యకు గురయ్యాడు. హతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదుతో గొల్ల కిట్టుతో పాటు పలువురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం గొల్ల కిట్టుతో పాటు తొమ్మిది మంది నర్సమ్మతో పాటు ఆమె బంధువులను కిడ్నాప్ చేసి.. కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు. ఈ విషయంపై సెప్టెంబర్ 19న నర్సమ్మ నార్త్ జోన్ డీసీపీ సుమతికి ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ చేసిన తమను స్థానిక టీడీపీ నాయకుడు బద్రీ యాదవ్ కార్యాలయానికి తీసుకెళ్లి.. కేసు రాజీ చేసుకోవాలని బెదిరించి, రూ. 5లక్షలు ఇచ్చారని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చెపట్టారు. గోల్లకిట్టుతో పాటు పలువురు పరారిలో ఉన్నారు. సొమవారం బద్రీ యాదవ్, రాజుయాదవ్ (రౌడీషీటర్) ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంత్రి ఒత్తిడితో కేసు నమోదు చేశారు: బద్రీ యాదవ్ హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని బద్రీ యాదవ్ అన్నారు. తన కార్యాలయంలో రోజుకు వివిధ సమస్యలపై బస్తీ వాసులు వస్తూ వేళ్ళుతుంటారని.. అయితే పథకం ప్రకారం తనపై పథకం ప్రకారం కేసు పెట్టారని బద్రీయాదవ్ మీడియాకు తెలిపారు. నాలుగు నెలలు గడచిన తరువాత పిర్యాదు చేయడం వెనుక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందని బద్రీ ఆరోపించారు. కార్పోరేటర్ ఎన్నిక నాటి నుండి తనపై మంత్రి కక్ష కట్టారని టీఆర్ఎస్ కు రాజీనామా చేసి టీడీపీ నుండి పోటీ చేసినందుకే తనపై కక్ష్య కట్టారని బద్రీ అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అక్రమంగా కేసులు నమోదు అయ్యేలా మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారలు వాస్తవాలు తెలసుకుని కేసులు నమోదు చేయాలన్నారు. -
తలసాని నీతులు చెప్పడమా?
మాజీ ఎంపీ మధుయాష్కీ హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తలసాని టీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరిన తెలంగాణద్రోహి అని, ప్రాజెక్టులకు అడ్డుపడొద్దంటూ ఆయన కూడా తెలంగాణవాదులకు నీతులు చెబితే అర్థం ఏముందని మాజీ ఎంపీ మధుయాష్కీ మండిపడ్డారు. బుధవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యమసమయంలో తెలంగాణవాదులపై దాడి చేసిన తలసాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తన అరాచకాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. తలసాని అవినీతిని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ ఒక్క కుటుంబమూ అభివృద్ధి చెందలేదన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ అంతా సీఎం కేసీఆర్ కుటుంబమే మింగేసిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో ఎత్తు పెంచడం, జనాన్ని ముంచడం, డబ్బులు దోచుకోవడమే టీఆర్ఎస్ పాలనలోని అసలు గుట్టు అని అన్నారు. కడియం, లక్ష్మారెడ్డిని తప్పించాలి: మహేశ్ ఎంసెట్ లీకేజీకి ప్రభుత్వ చేతకానితనం, నిర్లక్ష్యమే కారణమని, బాధ్యులైన మంత్రులు కడియం శ్రీహరి, సి.లక్ష్మారెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుం బానికి దగ్గరగా ఉండే వ్యక్తుల ద్వారా ఎంసెట్ లీకేజీలో దాదాపు రూ.200 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు. -
పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
లాలాపేట: రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన లాలాపేటలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన స్టీమ్ బాయిలర్, గోడౌన్, సెంట్రల్ క్వాలిటీ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విజయ ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉన్నందున మరిన్ని అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పశుగ్రాసం కొరత లేకుండా చూస్తామన్నారు. ఇకపై సబ్‌కమిటీ మీటింగ్ డెయిరీలోనే నిర్వహిస్తామన్నారు. డెయిరీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎండీ నిర్మలను అభినందించారు -
వైఎస్ జగన్‌కు మైలేజ్ వస్తుందనే..: తలసాని
హైదరాబాద్: ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం ఒక బాధ్యతా రాహిత్య చర్య అని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టిసీమీకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మైలేజ్ వస్తుందనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని తలసాని చెప్పారు. -
పర్యాటక కేంద్రాల్లో ‘విజయ’ ఔట్లెట్లు
పశుసంవర్థక శాఖ మంత్రిగా తలసాని బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: పర్యాటక కేంద్రాలు, దేవాలయ ప్రాంతాలు, జాతీయ రహదారులపై విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకపు కౌంటర్ల(ఔట్లెట్లు)ను ఏర్పాటు చేస్తామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్థకశాఖ మం త్రిగా శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహక బకాయిలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామన్నారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. వెటర్నరీ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించిందన్నారు. అయితే వెటర్నరీ వర్సిటీ ద్వారానే భర్తీ చేయాలన్న విద్యార్థుల సూచనపై ఆయా ప్రతినిధులతో చర్చిస్తామని చెప్పారు. గొర్రెల పెంపకందారులకు ఎన్సీడీసీ ద్వారా ఇచ్చే రుణాల మంజూరులో జాప్యాన్ని నివారిస్తామన్నారు. ఈ పథకం కోసం రూ. 398 కోట్లు సిద్ధంగా ఉన్నాయని... ఇందులో రుణం పొందినవారికి 20 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, ఇన్చార్జి డెరైక్టర్ తిరుపతయ్య, విజయ డెయిరీ ఎండీ నిర్మల పాల్గొన్నారు. -
తలసాని సోదరుడి బార్‌పై కేసు
రాంగోపాల్‌పేట: నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఓ బార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు శంకర్‌యాదవ్ గాస్మండిలో శివ బార్‌ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బార్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో పాటు మార్కెట్, లాలాపేట, గోపాలపురం ఇన్స్పెక్టర్లు తమ సిబ్బంది దాడి చేశారు. బార్లో మద్యం విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నా.. వాటిని ఉల్లంఘించి విక్రయిస్తుండటంతో కేసు -
వాణిజ్యపన్నుల శాఖలో సంస్కరణలు!
ప్రతి జిల్లాకు సొంత భవనం.. జిల్లాకో డిప్యూటీ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు అంతర్గత సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఏసీటీవో వరకు పోస్టుల సంఖ్యను పెంచాలని యోచిస్తున్నట్లు ఉన్నత వర్గాల ద్వారా తెలిసింది. అలాగే ప్రతి జిల్లాలో వాణిజ్యపన్నుల శాఖకు సొంత భవనం ఏర్పాటు చేయడం, సర్కిళ్లను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు 12 డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్‌కు సగటున 15 చొప్పున 200 వరకు సర్కిళ్లు ఉన్నాయి. అయితే వీటిలో హైదరాబాద్ పరిధిలోనే 7 డివిజన్లు ఉండడం గమనార్హం. ఈ సర్కిళ్లలో లావాదేవీలు పెరిగిపోవడంతో పన్ను చెల్లించకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్ లో ప్రత్యేక డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిలాబాద్ జిల్లాలో మం చిర్యాలను, కరీంనగర్లో రామగుండం, మెదక్‌లో సిద్ధిపేటను డివిజన్లుగా మార్చే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో 4 డివిజన్లను పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. డీలర్లు వేలల్లో.. సర్కిళ్లు పదుల్లో... ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోని ఏడు డివిజన్లలోని ప్రతి సర్కిల్లోనూ 5 వేలకుపైగానే డీలర్లు ఉన్నారు. వీరి నుంచి సక్రమంగా పన్ను వసూలు చేయడమే గగనమవుతున్న పరిస్థితుల్లో పన్ను ఎగవేతదారులపై దాడులు జరిపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని డివిజన్, సర్కిళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలిసింది. అలాగే చెక్‌పోస్టులను కూడా 2 నెలల్లోనే ఆధునీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్నతస్థాయిలో ఆమో దం లభించినట్లు సమాచారం. సంస్కరణల విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మూలాధారమైన వాణిజ్యపన్నుల శాఖ రెవెన్యూ పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
జీహెచ్ఎంసీ ఉద్యోగిపై హత్యాయత్నం
కత్తులతో బీభత్సం హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఉద్యోగి మచ్చ సాయికుమార్(32) ఇంటిపై గురువారం రాత్రి మద్యం మత్తులో కొందరు వ్యక్తులు కత్తులు, సీసాలతో దాడి చేశారు. భోలక్‌పూర్ కృష్ణానగర్‌లో ఆయన నివాసముంటున్నారు. అడ్డువచ్చిన సాయి అక్క, చెల్లెళ్లు స్వప్న, శోభలనూ గాయపరిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు టి.శ్రీనుతో పాటు అతని కుమారులు సంకేత్, సిద్ధు, సోదరుడు సంతోష్, మనోజ్, జేసుమన్, విక్రమ్ ఈ దాడిలో పాల్గొన్నట్లు గాంధీనగర్ పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత సాయి ఇంటికి వచ్చిన వీరు సుమారు 40 నిమిషాల పాటు బీభత్సం సృష్టించారు. గాంధీనగర్ పోలీసులు సాయికుమార్‌ను ముషీరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరి స్థితి స్థిమితంగా ఉన్నట్లు పోలీసులు తెలి పారు. కొన్ని రోజుల క్రితం సంకేత్, సిద్ధులకు బాధితుడి అల్లుడు రోమీ మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. నిందితులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య చెప్పారు. కాగా, చికిత్స పొందుతున్న సాయికుమార్‌ను శుక్రవారం మంత్రి తలసాని, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పరామర్శించారు. తనకీ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని తన పేరు ప్రస్తావిస్తున్నాయని తలసాని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ తన బంధువులు, అనుచరులెవరైనా తప్పు చేస్తే చట్టం ముందు అంతా సమానులేనన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఆయన కుటుంబీకులు దౌర్జన్యాలు చేస్తున్నారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. -
'దాడితో నాకెలాంటి సంబంధం లేదు'
హైదరాబాద్ : ఎవరో అనామకులు చేసిన నేరాలకు తనను బాధ్యుడినిగా చేసి తన బంధువులంటూ వార్తల్లో హల్చల్ చేయడం శోచనీయంగా ఉందని తెలంగాణ వాణిజ్యశాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ నగర్ పరిధిలో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తన బంధువులంటూ ప్రసారం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టం ముందు సమానమేనని, ఇలాంటి ఘటనలను ఎవరూ ప్రోత్సాహించరని అన్నారు. గతంలో జరిగిన సంఘటనల్లో కూడా తన పేరును కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని , దానిపై తన పేరును అనవసరంగా ఉపయోగించుకోకూడదని పత్రికా ఎడిటర్లకు విజ్ఞప్తి చేశానన్నారు. గాంధీ నగర్ సంఘటనపై మంత్రి స్పందిస్తూ 'ఇటువంటి విషయాల్లో నేను సాధారణంగా జోక్యం చేసుకోను నా పేరును ఉపయోగించినందుకే స్పందిస్తున్నానని' తెలిపారు. -
షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు
* త్వరలోనే అవార్డుల వేడుక ఏర్పాటు * నూతన చలనచిత్ర విధానం కూడా.. * అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రణాళికలు * అన్ని హంగులతో స్టూడియో నిర్మాణం * సినీ రంగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావాలి * కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు సాక్షి, హైదరాబాద్: సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. త్వరలోనే సినీ అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నంది అవార్డుల పేరు మార్చే ఆలోచన ఉందన్నారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు. చిత్రపురి కాలనీలో 10 వేల మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అన్ని థియేటర్లలో ఐదు షోల ప్రదర్శన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అంతర్జాతీయంగా తెలుగు చిత్ర రంగానికి గుర్తింపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రస్తుత విధివిధానాలను సడలించి నూతన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో అన్ని హంగులతో ఫిలిం స్టూడియోను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న సమాచారశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సినీ నిర్మాతలు ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం స్టూడియోకు వచ్చి చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేలా అన్ని హంగులున్న స్టూడియోను నిర్మించాలన్నారు. చిత్ర రంగంలో ఉన్న వివిధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి తగు సూచనలిస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. చలనచిత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి తలసాని అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కేటీఆర్‌తోపాటు ఉన్నతాధికారులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సినీ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పాల్గొన్న వారిలో దాసరి నారాయణరావు, డి.సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాదరెడ్డి, కె.ఎస్. రామారావు, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఎన్.శంకర్, వందేమాతరం శ్రీనివాస్, కళ్యాణ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆర్. నారాయణమూర్తి, ప్రతాని రామకృష్ణగౌడ్, రమేశ్ ప్రసాద్, సుప్రియ, బసిరెడ్డి, ప్రేమ్ రాజ్, సానా యాదిరెడ్డి, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామ్మోహన్రావు, 24 క్రాఫ్ట్స్ అధ్యక్షుడు కొమురం వెంకటేశ్, నాగరాజు తదితర నిర్మాతలు, డెరైక్టర్లు, చిత్ర కార్మిక సంక్షేమ సంఘాల నేతలు ఉన్నారు. సినీరంగం ప్రస్తావించిన ముఖ్యాంశాలు... * 41 చిన్న సినిమాలు, 7 బాలల చిత్రాలకు రావాల్సిన రాయితీల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ళీ సినిమా టికెట్లకు ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించాలి. ళీ మల్టీప్లెక్స్‌ల తరహాలో మిగతా థియేటర్లకు 5వ షోకు అనుమతి ఇవ్వాలి. * ఆర్ అండ్ బీ, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్ నుంచి పొందాల్సిన బీఫాం లెసైన్స్ రెన్యువల్ విధానాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచాలి. * చిత్ర నిర్మాణానికి అవసరమైన సాంకేతిక నిపుణులను అందించేందుకు పుణే తరహా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి. ళీ సినీ కార్మికులకు గృహ వసతి కల్పించేందుకు చిత్రపురి కాలనీ పక్కనే ఉన్న 9.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వారికే కేటాయించాలి. ళీ మున్సిపాలిటీలలో 200 సీట్ల సామర్థ్యంగల మినీ థియేటర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. -
చలనచిత్ర రంగం అభివృద్ధిపై 11న సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ది కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11న తొలిసారిగా సమావేశం కానున్నది. వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు, మంత్రులు కె.తారకరామారావు, తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొంటారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా చిత్ర నిర్మాతలు, దర్శకులు, థియేటర్ యజమానులు, పంపిణీదారులు, ఫిల్మ్ చాంబర్, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్, టెలివిజన్ రంగానికి చెందిన ప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లాయి. వీరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి చలనచిత్ర రంగానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. రాష్ట్రంలో సినిమా రంగ సమస్యలపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
గ్రేటర్ ఎన్నికల్లో మాకు సరి లేరు: తలసాని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమతో పోటీ పడే స్థాయిలో ఎవరూ లేరని రెండు, మూడు స్థానాలు ఎవరివో తేల్చుకోవాల్సింది టీడీపీ, కాంగ్రెస్‌లేనని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన మీట్ ది మీడియాలో తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే అమలు చేసిందన్నారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు, నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ తదితర పథకాల అమలుతో పాటు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.25 వేల కోట్లతో ఫ్లైఓవర్లు వంటి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. పేదవారు గొప్పగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో నివసించే వారంతా హైదరాబాదీయులేనని, నగరంలో గత 19 మాసాలుగా అన్ని ప్రాంతాలవారు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. గ్రేటర్లో వంద సీట్లు గెలుస్తామని, ఎంఐఎంతో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని స్పష్టం చేశారు. -
ఇద్దరు సీఎంలు కలిసినా ఓర్వలేరా: తలసాని
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్నా ప్రతిపక్షాలు ఓర్వడం లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధినే ఇద్దరు సీఎంలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ భవన్లో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటుందన్నారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ వెంట గ్రేటర్ ప్రజలు నడుస్తారన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఎప్పటిలాగే తాను ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తానని, అయితే కోడి పందాల కోసం కాదన్నారు. ఏపీలో తన మిత్రులను కలుసుకుంటానన్నారు. -
జీహెచ్ఎంసీ పీఠం టీఆర్ఎస్దే!
నంబర్ గేమ్‌లో మేమే ముందున్నాం: తలసాని ♦ హైదరాబాద్ నివాసితులంతా తెలంగాణ వారే ♦ సెటిలర్లకు కూడా సీట్లు ఇస్తాం.. ♦ గ్రేటర్ హైదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో ♦ సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళతామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ పీఠం టీఆర్ఎస్దేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని 150 సీట్లలో 76 సీట్లు గెలుచుకున్న వాళ్లకే మేయర్ పదవి లభిస్తుందని, ఈ నంబర్ గేమ్‌లో తామే ముందున్నామని చెప్పారు. మేయర్‌ను ఎన్నుకునేవారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారని, ఆ లెక్కన తమకు కొన్ని ఓట్లు ఉన్నాయన్నారు. మరికొన్ని డివిజ న్లను గెలుచుకుంటే చాలని వ్యాఖ్యానించారు. అదే ప్రతిపక్షాలు జీరో నుంచి మొదలుపెట్టాలన్నారు. తలసాని శనివారం సచివాలయంలోని తన చాంబర్లో పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్లను పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం. 2002 ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) ఎన్నిక ల్లో ప్రత్యక్ష పద్ధతిలో తీగల కృష్ణారెడ్డిని మేయర్‌గా ఎన్నుకుంటే సుభాష్చందర్ను డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవలసి వచ్చింది. అప్పుడు టీడీపీ, బీజేపీలకు బలం లేకపోయినా, ఎక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకొచ్చి ఓట్లు వేయించి గెలిపించారు. అలాంటి సంఘటనలు పరోక్ష ఎన్నికల్లో చాలానే జరిగాయి..’’ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తలసాని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేటర్లో 80 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం పెద్ద సమస్య కాదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని చెప్పారు. దొంగదారిలో గెలవాల్సిన అవసరం లేదు సంక్రాంతికి ఆంధ్రా ప్రాంతపు ప్రజలు సెలవు ల్లో వెళ్లిపోయాక జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ అవసరం టీఆర్ఎస్కు లేదని తలసాని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయన్నారు. గత 19 నెలల కాలంలో ఆంధ్రా ప్రాంతపు ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. ‘‘విజయవాడకు కేసీఆర్ వెళితే వచ్చిన రెస్పాన్స్ మీకు తెలుసు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలను అందరికి ఆమోదయోగ్యమైన సమయంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రాకు ప్రజలు వెళ్లిన తరువాత ఓట్లు వేయించుకునే ఖర్మ మాకు లేదు. అయినా నంబర్ గేమ్‌లో మేం గెలిచిపోయాం. మెజారిటీనే మాకు కావలసింది. దొంగదారులు మాకెందుకు?’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారంతా తెలంగాణ వారేనని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటేస్తారనేది తమ నమ్మకమని పేర్కొన్నారు. కేసీఆర్ విజన్ ముందు ఎవరూ పనికిరారు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు ఓ విజన్ ఉందని తలసాని స్పష్టం చేశా రు. ఇంజనీర్లను పిలిపించి రాత్రి వరకు సమావేశాలు నిర్వహించి, జీహెచ్ఎంసీ అభివృద్ధిపై ఓ కార్యాచరణ రూపొందించారని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ను కలుషితం చేసే నాలాలను మళ్లిస్తున్నామని.. ఇక సాగర్‌లోని నీటిని ఖాళీ చేయించి, అధునాతన టెక్నాలజీ ద్వారా కొత్త నీటిని నింపడమే మిగిలిందని పేర్కొన్నారు. -
'ప్రజలు నాలుకలు చీరెస్తరు'
హైదరాబాద్: ఏ ఎన్నికలు వచ్చినా విజయం టీఆర్ఎస్దేనని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై మరిన్ని రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే టీఆర్ఎస్ కు భారీ స్థాయి మెజార్జీ ఖాయమవడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పరిపాలనకు నిదర్శనం అని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు మాత్రం తమ వెంటే ఉన్నారని చెప్పారు.| ముఖ్యంగా అధికారం చేపట్టిన 17 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి బాటలు వేశాయని చెప్పారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శల దాడికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అని చెప్పారు. ఎంతోమంది నాయకులు తమపై వ్యక్తిగత విమర్శలకు దిగారని, ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అడ్గగోలిగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నాలుకలు చీరేస్తారు అని చెప్తారని ఈ ఉప ఎన్నికలు రుజువు చేశాయని అన్నారు. ఈ గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందిస్తామని చెప్పారు. -
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే దమ్ముందా?
బీజేపీకి మంత్రి తలసాని సవాల్ సాక్షి, హైదరాబాద్: ‘ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంది. తమ పార్టీ ఎంపీలు అండగా వస్తారు, బీజేపీకి బిల్లు పెట్టే దమ్ముందా..’ అని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఇప్పటికే తాము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది పనిచేసే ప్రభుత్వం కాబట్టే, ప్రజలు తప్పకుండా అడుగుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం 29 రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, కానీ, ఏపీని ఒకలా, తెలంగాణను మరొకలా చూస్తోందని మండిపడ్డారు. అర్బన్ హౌసింగ్‌లో ఏపీకి 1.93 లక్షల ఇళ్లు కేటాయిస్తే, తెలంగాణకు ఇచ్చింది కేవలం 10 వేలేనని, ఇక బీజేపీ నేతలకు మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రుణమాఫీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని అప్పు ఇవ్వాలని కోరితే దానికి ఇప్పటివరకు స్పందన లేదని, మళ్లీ బీజేపీ నేతలే రుణమాఫీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఆశావర్కర్ల సమస్య కేంద్ర పరిధిలో ఉందని, ఈ సమస్య పరిష్కారానికి మంత్రి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కేంద్రంతో ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. -
తలసానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి చట్టసభలకు ఎన్నిక కాకుండా మంత్రిగా కొనసాగుతున్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో.. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రభుత్వ సీఎస్‌కు సైతం నోటీసులు జారీ చేస్తూ.. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తలసాని తిరిగి చట్టసభలకు ఎన్నిక కాకుండా మంత్రిగా కొనసాగుతుండటం రాజ్యాంగ విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన విలేకరి శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఒక పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తరువాత ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రిగా కొనసాగుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సతీష్‌కుమార్ వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘తలసాని రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. తలసాని ఇంకా శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన మంత్రిగా ఉండటంలో ఎటువంటి తప్పులేదు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అనర్హత అంశంపై తెరపైకి వస్తుంది..’’ అని పేర్కొంది. అనంతరం కొంతసేపు వాదనలు విన్న ధర్మాసనం... ప్రతివాదులుగా ఉన్న తలసాని, ప్రభుత్వ సీఎస్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
గడువు.. 60 రోజులు
సాక్షి, హైదరాబాద్: అక్రమ భవనాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చివరిసారిగా(వన్‌టైం) అక్రమాల క్రమబద్ధీకరణ జరుపుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకోడానికి 60 రోజుల గడువు విధించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ 2015 అక్టోబర్ 28 నుంచి అమల్లోకి రాగా.. భవనాల క్రమబద్ధీకరణ మాత్రం నవంబర్ 3 నుంచి అమల్లోకి రానుంది. కటాఫ్ కీలకం.. క్రమద్ధీకరణకు కటాఫ్‌గా 2015 అక్టోబర్ 28వ తేదీని ఖరారు చేశారు. ఈ కటాఫ్ లోపు రిజిస్ట్రరైన లే అవుట్లు/ప్లాట్లతో పాటు నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించనున్నారు. అయితే 1985 జనవరి 1కి ముందు నాటి భవనాలకు మినహాయింపు కల్పించారు. 1985 జనవరి 1 నుంచి 2015 అక్టోబర్ 28 లోపు నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణ తప్పనిసరి. కటాఫ్ తేదీ నిర్ధారణ కోసం లే అవుట్లు/ప్లాట్ల విషయంలో సేల్స్ డీడ్ రిజిస్ట్రేషన్ తేదీని మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నారు. కటాఫ్ లోపు నిర్మితమైన భవనాలను గూగుల్ మ్యాప్స్‌లోని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా గుర్తిస్తారు. క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే.. క్రమబద్ధీకరించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించినా ఉపయోగించుకోకుండా నేరాన్ని కొనసాగిస్తున్నట్లు పరిగణించి భారీ జరిమానాలను విధించనున్నారు. స్థానిక పురపాలికలు క్రమబద్ధీకరించుకోని భవనాల కూల్చివేత, ఇతర తీవ్ర చర్యలకు ఉపక్రమించనున్నాయి. సదరు భవనం ఉన్న స్థలంలో తదుపరి నిర్మాణాలకు సైతం అనుమతులు నిరాకరించనున్నారు. ఇక అక్రమ లే అవుట్లకు సాధారణ కేటగిరీ కింద నల్లా కనెక్షన్, డ్రైనేజీ, సీవరేజీ సేవలను నిలిపేయనున్నారు. అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. అక్రమ లే అవుట్లలో భవనాల నిర్మాణాలకు అనుమతులు నిరాకరించడంతో పాటు ఒకవేళ నిర్మిస్తే కూల్చివేయనున్నారు. దరఖాస్తు తర్వాత కూడా నిర్మాణాలను కొనసాగిస్తే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు వసూలు చేసిన ఛార్జీలను జప్తు చేసుకోనున్నారు. చార్జీల మోత... గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలు 40-70 శాతం వరకు పెరిగాయి. క్రమబద్ధీకరణ చార్జీలకుతోడుగా అభివృద్ధి రుసుం సైతం చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే కనీసం 50 శాతం చార్జీలను లేదా రూ.10 వేలను డీడీ రూపంలో తొలుత చెల్లించాలి. భవనం/లే అవుట్ మార్కెట్ విలువపై 20-100 శాతం వరకు అభివృద్ధి రుసుంను విధించనున్నారు. లే అవుట్ల విషయంలో చదరపు మీటర్‌కు రూ.200-750 వరకు క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేయనున్నారు. భవనాల విషయంలో చదరపు మీటర్‌కు వ్యక్తిగత నివాస భవనాలపై రూ.15-200 వరకు, వాణిజ్య భవనాలపై రూ.30-400 వరకు చార్జీలను విధించనున్నారు. బహుళ అంతస్తుల భవనాలు/అపార్ట్మెంట్లు/ప్లాట్ల విషయంలో చార్జీలు భారీగా ఉండనున్నాయి. కాగా, మురికి వాడల్లోని ప్లాట్లను మాత్రం స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రతి చదరపు మీటరుకు రూ.5 రుసుంతో క్రమబద్ధీకరించనున్నారు. అక్రమాలపై క్రిమినల్ కేసులు: తలసాని రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ మేరకు భవన నిర్మాణ చట్టాన్ని సవరించాలని కోరామన్నారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్‌తో కలిసి సోమవారం సచివాలయంలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. తన నేతృత్వంలోని అధ్యయన కమిటీ అందజేసిన నివేదికలోని సిఫారసుల ఆధారంగానే ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. అక్రమ లే అవుట్లు, భవనాలను కట్టడి చేసేందుకు ఈ కింది సిఫారసులు చేశామన్నారు. ► టౌన్ ప్లానింగ్ విభాగానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం న్యాయ సలహా తీసుకోవాలి ► అక్రమ లే అవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయరాదు ► అక్రమ కట్టడాలను అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం/ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి ► భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులకు సింగిల్ విండో విధానం తేవాలి ► భవిష్యత్తులో వెలిసే అక్రమ నిర్మాణాల నుంచి ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లులను మూడింతలు వసూలు చేయాలి. ► భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించాలి -
'భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు'
-
భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు: తలసాని
♦ వివరణ లేకుండా వార్తలు రాస్తారా? ♦ విలేకరులతో మంత్రి తలసాని ♦ భువన, ఆమె తల్లిదండ్రులతో కలసి మీడియా సమావేశం హైదరాబాద్: ‘మంత్రులకు కుటుంబం ఉం డదా.. మేం మనుషులం కాదా? బయట జరిగే సంఘటనలను మాకు ఆపాదిస్తే ఎలా? మీడి యా సంస్థల అధిపతులు, వారి కుటుంబ సభ్యులు తప్పతాగి హోటళ్లలో ఉండి సమస్య ల్లో ఇరుక్కుంటే ఆదుకున్న సందర్భాలు లే వా?’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తన కుమారునిపై కేసు నమోదు కు సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయన టెన్నిస్ క్రీడాకారిణి భువన, ఆమె తల్లిదండ్రు లు శ్రీలత, మహేంద్రనాథ్రెడ్డిలతో కలసి ఆది వారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రేమ వివాహం చేసుకున్న భువనను ఆమె భర్త అభినవ్ వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పుకుంది. అభినవ్ ఆమె పుట్టింటికి వచ్చి గొడవచేసి మహేంద్రనాథ్‌పై దాడి చేశాడు. సమస్యను నాకు చెప్పుకునేం దుకు వచ్చారు. ఆ సమయంలో నేను అందుబాటులో లేకపోవడంతో నా కుమారుడు సమస్య అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అభినవ్ వారిపై దాడిచేశాడు. అక్కడే ఉన్న కొందరు అనుచరులు గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించి సాయికిరణ్ అనే వ్యక్తి పేరిట కేసు నమోదైతే అంతా మంత్రి కుమారుడిపై కేసు నమోదైనట్లు రాయడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ఓ అమ్మాయికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపాల్సిన మీడియా.. ఆ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేయడం తగదన్నారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందంటూ అభినవ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో కొన్ని పత్రికలు తన పేరును అనవసరంగా జోడించి, ఆ తర్వాత నిజాలు తెలుసుకుని క్షమాపణ చెప్పడాన్ని ఆయన ఉదహరించారు. అభినవ్‌పై కేసు నమోదు భువన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీసుస్టేషన్లో అభివన్పై ఆదివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన భువనారెడ్డి ఈ ఏడాది మేలో అభినవ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి వెళ్లనీయకుండా ఇంటికి పరిమితం చేశాడని తన భర్తపై భువనారెడ్డి ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి ఫోన్ చేసి కూమార్తెను ఇంటికి పంపించాలని కోరిన సమయంలో రూ.3 కోట్లు ఇస్తేనే పంపిస్తానని డిమాండ్ చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే మొదట పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడని పేర్కొంది. ఈ మేరకు అభినవ్‌పై అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినందుకు 498ఏ, మొదటి పెళ్ళి విషయాన్ని దాచి రెండో వివాహం చేసుకున్నందుకు 195 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తలసాని కుమారుడి కేసులో కీలక మలుపు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభినవ్-భువన వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమ విషయంలో జోక్యం చేసుకొని మంత్రి తలసాని కొడుకు దాడి చేశాడని అభినవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అభినవ్ భార్య భువన కీలక వివరణ ఇచ్చింది. అసలు అభినవే తనను ఇబ్బందులకు గురిచేశాడని, తన తండ్రిని విపరీతంగా కొట్టాడని చెప్పింది. తలసాని కుమారుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో స్వయంగా మంత్రి తలసాని ఈ విషయంలో జోక్యం చేసుకొని భువనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు వివరాలను చెప్పింది. తాను అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి అని, జిమ్ కు వెళ్లే సమయంలో తనకు అభినవ్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం పెరిగిందని, ఈ లోగా ఓ మ్యాచ్‌లో తాను ఓడిపోవడంతో తండ్రి తిట్టాడని ఆ సమయంలో తనను అభినవ్ వాళ్లింటికి వచ్చేయమని చెప్పడంతో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా వెళ్లానని, ఆ మరుసటి రోజే వివాహం చేసుకున్నామని వివరించింది. ఆ విషయం రెండు రోజుల్లో తన తండ్రికి చెప్పడంతో పెద్ద కూతురు పెళ్లి కావాల్సి ఉన్నందున ఇప్పుడప్పుడే తొందరపడి బయటకు చెప్పొద్దని వచ్చే ఏడాది పెళ్లి జరిపిస్తామని చెప్పాడని పేర్కొంది. ఐదు నెలలుగా తాను తన తండ్రి వద్దే ఉంటున్నానని, 20 రోజుల కిందటే అభినవ్ వద్దకు వెళ్లానని ఈ 20 రోజుల్లోనే అతడి అసలు స్వరూపం బయటపడిందని చెప్పింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను ఆడనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడని, బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి డోర్ వేసి వెళ్లిపోయేవాడని, కాలేజీ కూడా లేకుండా చేశాడని వాపోయింది. ప్రతి రోజూ చిత్ర హింసలు పెట్టేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపించింది. తన అక్కకు పెళ్లి చూపులు కావడంతో తీసుకెళ్లేందుకు వచ్చిన తన తండ్రితో పంపించేందుకు ఒప్పుకోలేదని రూ.మూడు కోట్లు డిమాండ్ చేశాడని, అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఎంత ప్రాపర్టీ ఉంటే అంత అభినవ్ పేరు మీద రిజిష్టర్ చేయాలని డిమాండ్ చేశాడని చెప్పింది. తర్వాత ఏం మాట్లాడుకున్నారో.. అక్టోబర్ 24 రాత్రి తనను ఇంట్లో దింపేసి వెళ్లాడని, రెండు రోజులు అక్కడే ఉండాల్సిన తనను ఉన్నపలంగా ఇంటికొచ్చేయమన్నాడని తాను కూడా అందుకు సిద్ధమయ్యానని చెప్పింది. ఇంతలో మరో రోజు అభినవ్ వచ్చి గొడవ పెట్టుకొని తన తండ్రి మహేందర్ రెడ్డిని తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తన తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అనంతరం అబినవ్, భువన తండ్రి మహేందర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణను మంత్రి తలసాని మీడియాకు వినిపించారు. -
అక్రమ నిర్మాణాలకు చోటివ్వం
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో భవిష్యత్తులో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూస్తామని... అనుమతుల మంజూరులో సరళీకృత పద్ధతులు ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. సర్వీసు రోడ్లు, నాలాలు, చెరువు శిఖం, జీవో నెంబర్ 111కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తలసాని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ కార్యక్రమాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. అనంతరం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతులు, క్రమబద్ధీకరణ విషయమై నిబంధనల రూపకల్పనకు... క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రుల కమిటీ త్వరలో నగర పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులు 2007 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని... వాటి విషయమై చర్చించామన్నారు. మరోమారు చర్చించాక సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో అనుమతులకు గతంలో 180 రోజుల గడువు ఉండేదని... దాన్ని 30 రోజులకు కుదించే విషయమై చర్చించామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌కు... స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరాన్ని 425 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షల వంతున విడుదల చేశామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగర సమీపంలో రెండు జలాశయాలను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. మార్ట్గేజ్ తొలగింపు వంటి విషయాల్లో నిబంధనలు సరళతరం చేసే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్‌శాఖ మంత్రి టి.పద్మారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఎమ్మెల్సీ స్టీఫెన్సన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రమబద్ధీకరించని కట్టడాలను కూల్చేస్తాం
- చట్టపర అడ్డంకులు, ఇతర అభ్యంతరాలు లేకుంటేనే క్రమబద్ధీకరణ: తలసాని - దేవాదాయ, వక్ఫ్, నాలా, చెరువు, మున్సిపల్ స్థలాల్లో నిర్మాణాలను ఉపేక్షించం సాక్షి, హైదరాబాద్: చట్టపరమైన అడ్డంకులు, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని క్రమబద్ధీకరించేందుకు ఆస్కారం లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో దేవాదాయ, వక్ఫ్ భూములు, నాలాలు, చెరువులు, మున్సిపల్ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కాదని, వాటిని కూల్చివేయక తప్పదని చెప్పారు. కూల్చివేతల వల్ల ఇళ్లను కోల్పోయే పేదలకు ప్రభుత్వం అమలు చేయనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద పునరావాసం కల్పిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు, ప్రభుత్వ సలహాదారుడు పాపారావుతో మంత్రి తలసాని నేతృత్వంలోని కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ, కొత్త భవన నిర్మాణ పాలసీ రూపకల్పన తదితర అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ నగరంలోని అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం త్వరలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణతో పాటు భవిష్యత్‌లో మళ్లీ కొత్త అక్రమ కట్టడాలు పుట్టుకురాకుండా నియంత్రించాలన్న ఉద్దేశంతో చివరిసారిగా ఈ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో క్రమబద్ధీకరణలకు అవకాశం ఉండబోదని, ఒకవేళ ఎక్కడైనా అక్రమ కట్టడం/లే అవుట్ వెలిసినా.. ఆ ప్రాంత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కొత్త భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తాకట్టు(మార్ట్గేజ్) నిబంధన వల్ల ప్రస్తుతం పేదలు 100 గజాలు, 150 గజాల్లో సైతం ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి పొందలేకపోతున్నారని, పేదలకు ఈ విషయంలో సడలింపు ఇస్తామన్నారు. నగరంలోని కోటి 42 లక్షల మంది జనాభా అవసరాలకు తగ్గట్లు సదుపాయాలను కల్పించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకనే అక్రమ కట్టడాలు, లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయని, దీనికి పరిష్కారంగా అన్ని శాఖల అనుమతులు ఒకే దగ్గర లభించేలా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు. -
వార్షికోత్సవ సందడి
-
శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా: షబ్బీర్
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా (ఒకపార్టీ నుంచి పారిపోయి మరోపార్టీలో చేరిన వ్యక్తి) అని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఒకపార్టీ నుంచి గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి మంత్రిగా ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ వంటివారు దేశంలో మరొకరు లేరని ఎద్దేవాచేశారు. అటువంటి శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలను జైలులో పెడతామని హెచ్చరించడమేమిటని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దమ్ముంటే తమను జైలులో పెట్టించాలని, అప్పుడు తమ తఢాకా చూపుతామని హెచ్చరించారు. జైళ్లు తమకు కొత్త కాదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని చెప్పినదానికి ప్రతిపక్షాలు భజన చేయాలా అని నిలదీశారు. ముందు ఎమ్మెల్యేగా తలసాని రాజీనామా చేసి మళ్లీ గెలిచి మంత్రి అయితే అప్పుడు ఆయనకు సమాధానం చెబుతామన్నారు. చీప్‌లిక్కర్ వెనుక రహస్య ఎజెండా : ఎమ్మెల్సీ పొంగులేటి టీఆర్ఎస్ ప్రభుత్వం చీప్‌లిక్కర్ ఆలోచన వెనక రహస్య ఎజెండా ఉందని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ విధానం తీసుకొస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి చీప్‌లిక్కర్ తెలంగాణను తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. -
'తలసాని.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ'
ఆదిలాబాద్ (నిర్మల్) : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యవహారం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడాతూ..ఓ పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరిన ఆయన తనకు ఓట్లేసిన ప్రజలనూ మోసం చేశాడని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పి మంత్రి పదవి చేపట్టిన ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా గవర్నర్ తన విచక్షణ అధికారాలను ఉపయోగించి ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టాలని ఉత్తమ్ కోరారు. ఆదిలాబాద్‌లోనూ ఉప ఎన్నికలు తప్పవని, పరోక్షంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోనేరు కోనప్పలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతకు ముందు నిర్మల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
కబ్జాదారులను వదలం
సాక్షి, సిటీబ్యూరో :‘చెరువులను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు సాగించిన అక్రమార్కులు ఎంతటివారైనా వదిలే సమస్యే లేదు. వివిధ నిర్మాణాలకు యూఎల్సీ అనుమతులున్నా వాటిని రద్దు చేస్తాం’ అని రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గత ప్రభు త్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం వల్లే చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరిగాయని, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన హెచ్ఎండీఏ ప్రజాప్రతినిధుల కమిటీ బుధవారం జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలాలను, జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్, కూకట్‌పల్లిలోని రంగథామిని చెరువు, బోరబండలోని సున్నం చెరువులను సందర్శించి ఆక్రమణల తీరును ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హెచ్ఎండీఏలో కొందరు అవినీతి అధికారుల చర్యల వల్ల పలు చెరువుల ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాలు రావడంతో పాటు 111 జీవో పరిధిలోని పలు జలాశయాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఇకపై కబ్జారాయుళ్లపై కఠినంగా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో హెచ్ఎండీఏను మరింత పటిష్టం చేసేందుకు కొత్త కమిషనర్‌ను నియమించారని తెలిపారు. ఇదో మినీ ట్యాంక్‌బండ్ : కూకట్‌పల్లిలోని రంగథ మిని చెరువును రూ.5కోట్ల వ్యయంతో మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని ప్రకటించారు. గతంలో 46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రంగనాథ మిని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకొని కేవలం 23 ఎకరాలే మిగిలిందని, దీన్ని సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు తెలిపారు. ఓ భవన నిర్మాణ సంస్థ స్థానికంగా నాలాపై నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అలాగే 29 ఎకరాలున్న సున్నం చెరువు బడా భూకబ్జాదారుల చర్యల వల్ల 15ఎకరాలకే పరిమితమైందన్నారు. సమగ్ర నివేదిక రూపొందించాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమ నిర్మాణాలకు అవకాశం లేకుండా అవసరమైన ప్రాంతాల్లో ప్రహరీ నిర్మించి, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేయడం ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. బోరబండలో గతంలో కొందరికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. ఇక్కడే సర్వే.నం 18లో గల 4 ఎకరాల భూమిపై కబ్జాదారుల కన్నుపడిందనీ, వారి ఆటలు సాగకుండా ఆ స్థలంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తలసాని తెలిపారు. జవహర్‌నగర్‌లోని 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవ్వకుండా సంరక్షించేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కమిటీ అభిప్రాయపడిందన్నారు. ఇక్కడ ఇప్పటికే గుడిసెలు ఏర్పాటు చేసుకొన్న పేదప్రజలకు అన్యాయం జరగకుండా వారందరినీ ఒకేచోటకు చేర్చి వారికి పునరావాసం కల్పించాలని కమిటీ నిర్ణయించింది. పర్యటనలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రాములు నాయక్, రామచంద్రరావు, కంటోన్మెంట్ వైస్ ఛైర్మన్ కేశవరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి(మేడ్చెల్), ఎమ్మెల్యే కృష్ణారావు (కూకట్పల్లి), హెచ్ఎండీఏ ఎంఈ ఎస్.శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ రంజిత్ ప్రసాద్, ఇన్చార్జి సీఈ బీఎల్ఎన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఒళ్లంతా కుళ్లు
మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మాకు మద్దతిస్తే తప్పేంటి? తెలంగాణకు, ఆంధ్రకు ఏమైనా యుద్ధం జరిగిందా? చంద్రబాబు సెంటిమెంట్లను రెచ్చగొడుతున్నారు సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నిప్పు కాదని, ఆయన ఒళ్లంతా కుళ్లు, మనసులో దరిద్రపు ఆలోచన నిండి ఉంటుందని రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దుయ్యబట్టారు. ప్రజల్లో అనవసరపు సెంటిమెంట్లను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన సచివాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలతో కలసి మీడియాతో మాట్లాడారు. ఫోన్లు ట్యాప్ చేసే నీచమైన సంస్కృతి, దరిద్రపు ఆలోచన బాబుదేనని, తమకు అలాంటి అవసరంలేదని మండిపడ్డారు. ‘బాబుకు తన కేబినెట్ మంత్రులపై విశ్వాసం లేకనే ట్విట్టర్‌పిట్ట (లోకేశ్) చేత, ప్రతీ మంత్రి వద్ద నిఘా పెట్టించిండు. ఏపీ మంత్రులు కూడా భయంతో చస్తున్నరు. ఈ టైంలో మాట్లాడకపోతే తీసేస్తరేమోనని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మాకు మద్దతిస్తే తప్పేంటి? తెలంగాణకి, ఏపీకి యుద్ధం జరి గిందా? అనవసరంగా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నరు’ అని అన్నారు. బాబు మాదిరి చిల్లర రాజకీయాలు తాము చేయబోమని, ఏదైనా ధైర్యంగా ఢీకొంటామని అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రవహింప చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. ‘తెలంగాణలో జరిగిన మాదిరిగా ఆంధ్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గనక చేసుంటే.. జగన్ మీద కేసు పెట్టేవారు. ఒక వర్గం మీడియా నిత్యం దుమ్మెత్తి పోసేది’ అని వ్యాఖ్యానించారు. హైటెక్కు అని చెప్పుకునే బాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కూడా రాలేదని, ఆరుగురు ఎమ్మెల్యేలు నోటాకు ఓటు వేశారని ఎద్దేవా చేశారు. -
లోకేశ్ వెంట అధికారులు ఎలా అమెరికా వెళ్లారు?
టీడీపీ నేతలను నిలదీసిన తెలంగాణ మంత్రి తలసాని హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణ శిబిరానికి అధికారులు వస్తే రాద్ధాంతం చేసే తెలుగుదేశం నాయకులు అమెరికా వెళ్లిన లోకేశ్ వెంట ముఖ్యమంత్రి ఓఎస్డీ, ఓ ఐఏఎస్ అధికారి ఏ హోదాలో వెళ్లారో చెప్పాలని రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యం ఖూనీ గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే బాగుంటుందని టీడీపీ నేతలకు హితబోధ చేశారు. మంగళవారం సచివాలయంలో శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా పేరిట చేతులు, కాళ్లు ఊపేందుకు ఏకంగా రూ.1.25 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. -
కొండంత లక్ష్యం... అందుకునేదెలా?
వాణిజ్యపన్నుల శాఖ సమీక్షలో మంత్రి తలసాని ఆదాయం పెంపు మార్గాలపై సూచనలు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆదేశం జీరో వ్యాపారాన్ని అరికట్టి, పన్ను వసూళ్లు పెంచుతాం హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన వాణిజ్యపన్నుల శాఖను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించుకుని పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. వాణిజ్యపన్నుల శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ అనిల్ కుమా ర్, అదనపు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ రేవతి రోహిణిలతోపాటు డిప్యూటీ కమిషనర్లతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పన్ను వసూళ్లకు సంబంధించిన లోటుపాట్లను మం త్రి సమీక్షించారు. ‘2015-16 సంవత్సరానికి వాణిజ్యపన్నుల శాఖ రెవెన్యూ లక్ష్యం రూ. 36 వేల కోట్లు. ఈ ఏడాది పది నెలల్లోనే రూ. 24 వేల కోట్లు వసూలు చేశాం. అంటే దాదా పు 12 వేల కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుకోవాలి. గడిచిన నాలుగు నెలల్లో చూపిన చిత్తశుద్ధి వల్ల భారీగా ఆదాయం పెరిగింది. అదే స్ఫూర్తితో పనిచేయాలి’ అని మంత్రి అధికారులకు హితబోధ చేశారు. ప్రభుత్వ పథకాలకు పన్నులే ఆధారం.. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలు మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, హాస్టళ్లకు సన్నబియ్యం, పింఛన్లు వంటి ప్రజాహిత కార్యక్రమాలకు వాణిజ్యపన్నుల శాఖ ద్వారా వచ్చే రాబడే ప్రధాన ఆధారమని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. డివిజన్ల వారీగా ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా వివరించినట్లు సమాచారం. ‘పెద్ద హీరోల కొత్త సినిమా వస్తే రాష్ట్రంలోని అన్ని థియేటర్ల వద్ద హౌజ్‌ఫుల్ బోర్డు ఉంటుంది. కానీ వినోద పన్ను చెల్లించేటప్పుడు మాత్రం 30 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నట్లు థియేటర్ల యజమానులు చూపిస్తున్నారు. బంగారు, వస్త్రాల దుకాణాల్లో అమ్మకాల బిల్లులతోపాటు వారు కొనుగోలు చేసిన బిల్లులను కూడా పరిశీలించి పన్ను వసూలు చేయాలి’ అని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఆంధ్ర బోర్డర్లోని చెక్పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి నిఘా పెంచాలి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల నిర్మాణం పూర్తిచేయాలి, పన్ను చెల్లించనివారు, జీరో వ్యాపారం చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.’ అని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. -
వస్త్ర వ్యాపారులపై వ్యాట్ ఉండదు: తలసాని
రాంగోపాల్‌పేట్: వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ను అమలు చేయబోవడం లేదని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం జనరల్‌బజార్‌లో సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీర శ్రీకాంత్ అలియాస్ సత్యనారాయణతో పాటు 500 మంది వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వందల కోట్ల విలువైన సరుకు షాపులో ఉంచుకుని కూడా వ్యాట్ చెల్లించకుండా తప్పించుకునే బడా వ్యాపారులకు అమలు చేస్తే ఎలా ఉంటుందని తాను అధికారులకు సూచించానని వివరించారు. కానీ ఇలా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి దీన్ని అమలు చేసే ప్రసక్తి లేదని అన్నారు. గత ప్రభుత్వం వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధిస్తే ఇందిరాపార్కు వద్ద ధర్నాతో పాటు వ్యాపారులకు సంఘీభావం ప్రకటించి ముందుకు వచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దండె విఠల్, నాగేందర్, అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.