శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా: షబ్బీర్
హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక భగోడా (ఒకపార్టీ నుంచి పారిపోయి మరోపార్టీలో చేరిన వ్యక్తి) అని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఒకపార్టీ నుంచి గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి మంత్రిగా ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ వంటివారు దేశంలో మరొకరు లేరని ఎద్దేవాచేశారు. అటువంటి శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షాలను జైలులో పెడతామని హెచ్చరించడమేమిటని ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దమ్ముంటే తమను జైలులో పెట్టించాలని, అప్పుడు తమ తఢాకా చూపుతామని హెచ్చరించారు. జైళ్లు తమకు కొత్త కాదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తలసాని చెప్పినదానికి ప్రతిపక్షాలు భజన చేయాలా అని నిలదీశారు. ముందు ఎమ్మెల్యేగా తలసాని రాజీనామా చేసి మళ్లీ గెలిచి మంత్రి అయితే అప్పుడు ఆయనకు సమాధానం చెబుతామన్నారు.
చీప్‌లిక్కర్ వెనుక రహస్య ఎజెండా : ఎమ్మెల్సీ పొంగులేటి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చీప్‌లిక్కర్ ఆలోచన వెనక రహస్య ఎజెండా ఉందని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ విధానం తీసుకొస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ తెస్తామని చెప్పి చీప్‌లిక్కర్ తెలంగాణను తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు.