
సాక్షి, హైదరాబాద్: రామ్‌మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు.
అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.