
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా స్పృహ తప్ప కిందపడిపోయారు. దీంతో, హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ పతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. pic.twitter.com/FkgrFqc0iF
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2024