సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్ వద్ద బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్‌ఎస్ నేతలు అదానీ-రేవంత్ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.
బీఆర్‌ఎస్ నేతలంతా తెలంగాణభవన్ ముందు కూర్చుని నినాదాలు చేస్తూ..
అదానీ రేవంత్ భాయ్ భాయ్..
కోహినూర్ హోటల్ మే దేకో
రేవంత్ అదానీ ...
కొడంగల్ మే దేకో
రేవంత్ అదానీ ...
రామన్నపేట మే దేకో
రేవంత్ అదానీ ..
కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు .. అంటూ నినాదాలు చేశారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఒచ్చి గోవిందా ..
రేవంత్ ఒచ్చి గోవిందా ...
కల్యాణ లక్షి గోవిందా ..
తులం బంగారం గోవిందా ..
బతుకమ్మ చీరలు గోవిందా ..
చెపలు పెంచుడు గోవిందా ..
గొర్రెలు పంచుడు గోవిందా ..
రైతు బందు గోవిందా ..
రైతు రుణ మాఫీ గోవిందా ...
అంటూ నిరసనలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment