ఉపముఖ్యమంత్రికి తప్పిన ప్రమాదం! | Deputy Chief Minister Mahmood Ali in Lift | Sakshi
Sakshi News home page

ఉపముఖ్యమంత్రికి తప్పిన ప్రమాదం!

Published Mon, Mar 30 2015 8:57 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

మహమూద్ అలీ - Sakshi

మహమూద్ అలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హొం మంత్రి  నాయిని నర్సింహారెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. వీరు ఇద్దరూ ఎల్.బీ. నగర్లోని ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ ఆస్పత్రిలో లిప్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో వారు లిప్ట్లోనే ఉండిపోయారు. వెంటనే సిబ్బంది వచ్చి లిప్ట్కు మరమ్మతులు చేయడంతో వారు బయటకు వచ్చారు.
 
మంత్రి కారు టైరుకు పంక్చర్

ఆస్పత్రి ప్రారంభోత్సవం ముగిసిన తరువాత హొం మంత్రి నాయిని నరసింహా రెడ్డి సబ్ జైలుకు వెళుతుండగా కారు టైర్కు పంక్చర్ అయింది. దాంతో ఆయన కొద్దిసేపు నడిరోడ్డుపై నిలబడవలసి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న షాపులో టైర్కు పంక్చర్ వేయించిన తరువాత ఆయన  వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement