బెదిరింపుల కేసులో టీడీపీ నేత అరెస్ట్ | TDP leader arrested in hyderabad | Sakshi
Sakshi News home page

బెదిరింపుల కేసులో టీడీపీ నేత అరెస్ట్

Published Mon, Oct 3 2016 7:33 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

TDP leader arrested in hyderabad

మారేడుపల్లి: హత్య కేసులో సాక్షులను బెదిరించి కిడ్నాప్‌కు పాల్పడినందుకు సికింద్రాబాద్‌కు చెందిన టీడీపీ సీనియర్ నేత బద్రీ యాదవ్‌ను మారేడుపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ ఉమామహేశ్వర్ రావు కథనం ప్రకారం.. మారేడుపల్లిలో 2012లో శేఖర్ అనే స్థానికుడు రౌడీషీటర్స్ చేతిలో హత్యకు గురయ్యాడు. హతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదుతో గొల్ల కిట్టుతో పాటు పలువురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం గొల్ల కిట్టుతో పాటు తొమ్మిది మంది నర్సమ్మతో పాటు ఆమె బంధువులను కిడ్నాప్ చేసి.. కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు.
 
ఈ విషయంపై సెప్టెంబర్ 19న నర్సమ్మ నార్త్ జోన్ డీసీపీ సుమతికి ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ చేసిన తమను స్థానిక టీడీపీ నాయకుడు బద్రీ యాదవ్ కార్యాలయానికి తీసుకెళ్లి.. కేసు రాజీ చేసుకోవాలని బెదిరించి, రూ. 5లక్షలు ఇచ్చారని ఆమె తన ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చెపట్టారు. గోల్లకిట్టుతో పాటు పలువురు పరారిలో ఉన్నారు. సొమవారం బద్రీ యాదవ్, రాజుయాదవ్ (రౌడీషీటర్) ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
 
మంత్రి ఒత్తిడితో కేసు నమోదు చేశారు: బద్రీ యాదవ్
హత్య కేసు సాక్షులను బెదిరించిన కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని బద్రీ యాదవ్ అన్నారు. తన కార్యాలయంలో రోజుకు వివిధ సమస్యలపై బస్తీ వాసులు వస్తూ వేళ్ళుతుంటారని.. అయితే పథకం ప్రకారం తనపై పథకం ప్రకారం కేసు పెట్టారని బద్రీయాదవ్ మీడియాకు తెలిపారు. నాలుగు నెలలు గడచిన తరువాత పిర్యాదు చేయడం వెనుక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందని బద్రీ ఆరోపించారు. కార్పోరేటర్ ఎన్నిక నాటి నుండి తనపై మంత్రి కక్ష కట్టారని టీఆర్‌ఎస్ కు రాజీనామా చేసి టీడీపీ నుండి పోటీ చేసినందుకే తనపై కక్ష్య కట్టారని బద్రీ అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అక్రమంగా కేసులు నమోదు అయ్యేలా మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారలు వాస్తవాలు తెలసుకుని కేసులు నమోదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement