Minister Talasani Srinivas Yadav Launches Kerosene Trailer: ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందానికి మంత్రి తలసాని ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 నిమిషాల 14 సెకన్ల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉందన్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ పృధ్వీ యాదవ్, దీప్తి కొండవీటి, కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, వెంకన్న ముదిరాజ్, హేమంత్ యాదవ్, సురేంద్ర, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Minister Talasani Srinivas Yadav: ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Published Mon, Jun 6 2022 4:23 PM | Last Updated on Mon, Jun 6 2022 4:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment