'ఆ విషయంలో నన్ను క్షమించండి'.. ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ రిక్వెస్ట్ | Allu Arjun And Rashmika Mandanna Speech Highlights In Patna Trailer Launch Event, Deets Inside | Sakshi
Sakshi News home page

Pushpa 2 Trailer Launch Event: మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా: పుష్ప డైలాగ్‌ చెప్పిన బన్నీ

Published Sun, Nov 17 2024 7:50 PM | Last Updated on Sun, Nov 17 2024 9:51 PM

Icon Star Allu Arjun Comments In Trailer Launch Event

ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్‌ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ  సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా  బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్‌లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల  చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.

బన్నీ మాట్లాడుతూ..' నమస్తే.. బీహార్‌ గడ్డకు, ప్రజలందరికీ నా శతకోటి ప్రణామాలు.. బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్‌ కాదు  వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్‌ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, అభిమానులకు థ్యాంక్స్‌. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా' అంటూ ఐకాన్ స్టార్‌ మాట్లాడారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్.

హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు.  పుష్ప శ్రీవల్లి ఈ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నా. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందిన. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు శ్రీవల్లి.

కాగా.. ఈ ఈవెంట్‌లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌ షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్‌ ట్రైలర్‌ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2  ట్రైలర్‌ చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప-2 థియేటర్లలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement