దమ్ముందా.. నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా! | Digvijay- Telangana police row: Shabbir Ali criticises Minister Talasani | Sakshi
Sakshi News home page

దమ్ముందా.. నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా!

Published Sat, May 6 2017 3:42 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

దమ్ముందా.. నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా! - Sakshi

దమ్ముందా.. నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా!

- మంత్రి తలసానికి షబ్బీర్ సవాల్
- పరుష పదజాలంతో విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత
హైదరాబాద్: 'సిటీలో దిగ్విజయ్ ని తిరగనివ్వం' అన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. శనివారం గాంధీభవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన..  ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీ తరఫున మంత్రిగా కొనసాగుతున్న నీకు దిగ్విజయ్ గురించి మాట్లాడే అర్హత లేదు. మగాడివైతే, దమ్ముంటే ముందు రాజీనామాచేసిన తర్వాత మాట్లాడు..' అని మండిపడ్డారు.
 
'నకిలీ ఐసిస్ వెబ్ సైట్ కు సంబంధించి తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ చేసిన ఆరోపణలకు అయన వద్ద పూర్తి స్థాయి ఆధారాలు వున్నాయి. దిగ్విజయ్ ని హైద్రాబాద్ లో కాలు పెట్టనీయనని తలసాని అంటున్నారు. ఆయనకు సవాలు విసురుతున్నా. దిగ్విజయ్ హైదరాబాద్ రాగానే నీ(తలసాని) ఇంటిముందు కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ పెడతా. దమ్ముంటే అడ్డుకో..' అని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్‌సిటీగా మార్చారని, సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ అభివృద్ధి అంతా మాటల్లోనే చూపుతున్నారని, చేతలు మాత్రం శూన్యమని షబ్బీర్ విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నగరంలో ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేదని, అధికార పార్టీ నాయకుల వేధింపుల కారణంగా నగరంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న సంస్థలు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నాయని షబ్బీర్ అలీ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement