చిన్న సినిమా... పెద్ద విజయం | Saptagiri Express 50 days function | Sakshi
Sakshi News home page

చిన్న సినిమా... పెద్ద విజయం

Published Wed, Mar 15 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

చిన్న సినిమా... పెద్ద విజయం

చిన్న సినిమా... పెద్ద విజయం

‘‘చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విధానాలను అమలుచేస్తోంది. చారిత్రాత్మక చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’తో విజయం అందుకున్న దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు.

 సప్తగిరి, రోషిణి జంటగా అరుణ్‌పవార్‌ దర్శకత్వంలో డాక్టర్‌ కె. రవికిరణ్‌ నిర్మించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ అర్ధ శతదినోత్సవ వేడుకలో తలసాని పాల్గొన్నారు. రవికిరణ్‌ మరిన్ని సక్సెస్‌పుల్‌ చిత్రాలను తీయాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆకాంక్షించారు. ‘‘చిన్న చిత్రమైనా పెద్ద విజయం అందుకున్నాం. సప్తగిరితో మరో చిత్రం చేయనున్నాం. మా బ్యానర్‌ తరఫున సప్తగిరికి కారును బహుమతిగా ఇవ్వనున్నాం’’ అన్నారు రవికిరణ్‌. సప్తగిరి, రోషిణి, అరుణ్‌ పవార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement