Saptagiri Express
-
వజ్రానికి కవచంలా...
‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఫేమ్ అరుణ్ పవార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బేబీ శస్త్ర సమర్పణలో శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్, ప్రత్యేక పాటను హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి’ చిత్రాల తర్వాత నన్ను నేను కొత్తగా ఎలా చూపించుకోగలను అని ఎదురుచూస్తున్న సమయంలో అరుణ్ పవార్ ఈ కథ చెప్పారు. ‘లక్ష్యం గొప్పదైనా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది’ అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నేను హీరోగా కాకుండా మంచి కమెడియన్‌గా ఎంటర్టైన్ చేస్తాను. ఎమోషనల్ కంటెంట్ కూడా ఉంది. సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. అరుణ్ పవార్ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పుడు నోట్ల రద్దు ఉన్నా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశారు. అంతకంటే మంచి పేరు, డబ్బులు రావాలనే కసితో ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. వజ్రం కోసం సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కథ’’ అన్నారు. ‘‘టైటిల్ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్ బాగా పెరిగింది. నరేంద్ర అన్నగారు ఈ సినిమాకు ఎంతో సహకారం అందించారు. మా సినిమా టీజర్ చూసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు జీవీఎన్ రెడ్డి. నటుడు రాఘవ, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ వనమాలి, డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య, సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, ఎడిటర్ కిషోర్ మద్దాలి మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలాన బాలగోపాలరావు. -
సప్తగిరి హీరోగా.. ‘వజ్ర కవచధర గోవింద’
అతని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే `వజ్ర కవచధర గోవింద` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు సప్తగిరి. కమెడియన్ సప్తగిరి ఫన్నీ దొంగగా నటిస్తున్న సినిమా `వజ్ర కవచరధర గోవింద`. ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ `నా దర్శకత్వంలో సప్తగిరి హీరోగా నటించిన `సప్తగిరి ఎక్స్ ప్రెస్` విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా రూపొందిస్తున్న `వజ్ర కవచధర గోవింద` అంతకు మించి సక్సెస్ కావాలనే తపనతో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తోంది. సప్తగిరి వ్యావహారిక శైలికి పర్ఫెక్ట్గా సూటయ్యే కథ ఇది. మా కథకు అనుగుణంగానే పవర్‌ఫుల్‌గా `వజ్ర కవచధర గోవింద` అనే టైటిల్ పెట్టాం` అని అన్నారు. వైభవీ జోషి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . -
‘గజదొంగ’గా సప్తగిరి
సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న కమెడియన్ సప్తగిరి మరోసారి హీరోగా నటిస్తున్న సినిమా గజదొంగ. తొలి రెండు చిత్రాల్లో కామెడీ జానర్లో నటించిన సప్తగిరి మూడో సినిమాగా యాక్షన్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని నంద నందనా ప్రాజెక్ట్స్ పతాకంపై శర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి చిత్రాన్ని నిర్మించనున్నారు. గీతా ఆర్ట్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థల్లో దర్శకత్వ శాఖలో పనిచేసిన డి.రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు శర్మ చుక్కా, యెడల నరేంద్ర, G .V .N .రెడ్డి మాట్లాడుతూ ‘సప్తగిరికి యాప్ట్ సబ్జెక్ట్ ఇది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ‘గజదొంగ’కూ, దీనికీ సంబంధం లేదు. ఇందులో సప్తగిరిది దొంగలకు దొంగలాంటి పాత్ర. అసలు సిసలు దొంగల్ని దోచుకుని సమాజానికి ఉపయోగపడే దొంగగా కనిపించనున్నాడు. విలేజ్, టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఆగస్టు తొలి వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం’ అని తెలిపారు. -
సప్తగిరితో స్నేహం కుదిరింది – సాయిధరమ్ తేజ్
హాస్యనటునిగా వెండితెరపై మంచి ప్రతిభ కనబరచి, ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో కథానాయకుడిగా మారారు నటుడు సప్తగిరి. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’. సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై డా. రవికిరణ్ నిర్మిస్తున్నారు. బుల్గానిన్ స్వరకర్త. డిసెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను ఇటీవల దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. రెండో పాట ‘చేతి గాజల చప్పుడికే మనసే పతంగిలా ఎగిరే’ను హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్ మాట్లాడుతూ– ‘‘నా ‘తిక్క’ సినిమా సరిగా ఆడకపోయినా సప్తగిరితో మంచి స్నేహం కుదిరింది. తను హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ చుశాను. నచ్చింది. రెండో పాట విజువల్‌గా బాగుంది. సప్తగిరి డ్యాన్సులు అదరగొట్టాడు. ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. బుల్గానిన్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సాయిధరమ్ తేజ్ మా పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు థ్యాంక్స్’’ అన్నారు సప్తగిరి. ‘‘మా సినిమాలోని సాంగ్‌ను రిలీజ్ చేసినందుకు తేజ్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
ఆగస్టులో ఆరంభం
ఒక పక్క హాస్యనటునిగా అలరిస్తూనే మరోవైపు తనకు సరిపడా కథ, పాత్ర కుదరినప్పుడు హీరోగా నటిస్తున్నారు సప్తగిరి. తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’లో హీరోగా ఆకట్టుకున్న సప్తగిరి ఇప్పుడు రెండో సినిమాకి రెడీ అయ్యారు. చంద్రనాథ్ సమర్పణలో నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలు. ‘‘అన్నపూర్ణ స్టూడియోలో ఆగస్టు 5న మా చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాం. ఆ రోజున మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
హీరోగా కమెడియన్ మరో ప్రయత్నం..!
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి, హీరోగా మారేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటిరే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా మారిన ఈ కామెడీ స్టార్ ఇప్పుడు మరో సినిమాను మొదలు పెట్టాడు. తొలి సినిమా తరహాలోనే రెండో సినిమాకు కూడా తన పేరునే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశాడు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన జాలీ ఎల్ ఎల్ బీ ఇన్సిపిరేషన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సప్తగిరి ఎల్ఎల్బి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు లాంచనంగా ప్రారంభించిన ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్న సినిమా... పెద్ద విజయం
‘‘చిత్రపరిశ్రమ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని విధానాలను అమలుచేస్తోంది. చారిత్రాత్మక చిత్రాలకు పన్ను మినహాయింపు ఇచ్చాం. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో విజయం అందుకున్న దర్శక–నిర్మాతలకు అభినందనలు’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సప్తగిరి, రోషిణి జంటగా అరుణ్‌పవార్ దర్శకత్వంలో డాక్టర్ కె. రవికిరణ్ నిర్మించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ అర్ధ శతదినోత్సవ వేడుకలో తలసాని పాల్గొన్నారు. రవికిరణ్ మరిన్ని సక్సెస్‌పుల్ చిత్రాలను తీయాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆకాంక్షించారు. ‘‘చిన్న చిత్రమైనా పెద్ద విజయం అందుకున్నాం. సప్తగిరితో మరో చిత్రం చేయనున్నాం. మా బ్యానర్ తరఫున సప్తగిరికి కారును బహుమతిగా ఇవ్వనున్నాం’’ అన్నారు రవికిరణ్. సప్తగిరి, రోషిణి, అరుణ్ పవార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్వేగం... ఉల్లాసం
స్టార్ కమెడియన్‌గా దూసుకెళ్తున్న సప్తగిరి హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో డాక్టర్ రవి కిరణ్ నిర్మించారు. కన్నడ నటి రోషిణీ ప్రకాశ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా లోని పాటలను హైదరాబాద్ ప్రదర్శించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. తండ్రి, కొడుకుల మధ్య బంధం, ఎమోషనల్ అంశాలుంటాయి. ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితం ఎలా సాగుతుంది. వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారనే అంశాలను ప్రస్తావించాం’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథే హీరో. మా చిత్రం చూసి ఎంత నవ్వుతారో అంతే భావోద్వేగానికి గురవుతారు. ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విదేశాల్లోని లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించాం’’ అని దర్శకుడు అరుణ్ పవార్ పేర్కొ న్నారు. ‘ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’ అని రోషిణి చెప్పారు. -
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' ఆడియో విడుదల
-
మేం అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్
‘‘సప్తగిరి ‘గబ్బర్‌సింగ్’లో ఓ సీన్ చేశాడు. ఆ సీన్లో మేమిద్దరం కలిసి నటించలేదు కానీ, బాగా చేశాడు. అప్పట్నుంచి కలవాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. నన్నిక్కడికి రప్పించింది నాపై అతనికున్న ప్రేమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. అరుణ్ పావర్ దర్శకత్వంలో శ్రీసాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్‌పై డా. రవి కిరణ్ నిర్మించారు. రోషిణి కథానాయిక. విజయ్ బుల్గానిక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ -‘‘నాతో శరత్‌మరార్ తీస్తున్న చిత్రానికి ‘కాటమరాయుడు’ టైటిల్ అనుకున్నాం. సప్తగిరి చిత్రానికి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు. కానీ, పెద్ద మనసుతో మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను సినిమాల్లో నటిస్తా కానీ, తక్కువగా చూస్తా. నేను చేసినవాటిలో ఇప్పటికీ రెండు సినిమాలు చూసుకోలేదు. ట్రైలర్ చూశాక సప్తగిరి సినిమా చూడాలనిపిస్తోంది.. చూస్తా’’ అన్నారు. ‘‘ఇంతమంది మెగాభిమానుల మధ్య ఓ మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతుందని ఊహించలేదు. చిన్నప్పట్నుంచి చిరంజీవిసార్ను అభిమానిస్తూ పెరిగా. నిజాయతీ గల అభిమానిని కాబట్టే పవన్‌సార్ వచ్చారు’’ అని సప్తగిరి అన్నారు. ‘‘సినిమా ఎలా తీయాలో త్రివిక్రమ్సార్ దగ్గర నేర్చుకున్నా. నన్ను ఆశీర్వదించడానికి పవన్ సార్ వచ్చినందుకు హ్యాపీ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇది’’ అని డా. రవి కిరణ్ అన్నారు.