ఉద్వేగం... ఉల్లాసం
స్టార్ కమెడియన్‌గా దూసుకెళ్తున్న సప్తగిరి హీరోగా తెరకెక్కిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో డాక్టర్ రవి కిరణ్ నిర్మించారు. కన్నడ నటి రోషిణీ ప్రకాశ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా లోని పాటలను హైదరాబాద్ ప్రదర్శించారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. తండ్రి, కొడుకుల మధ్య బంధం, ఎమోషనల్ అంశాలుంటాయి.
ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితం ఎలా సాగుతుంది. వారికి ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారనే అంశాలను ప్రస్తావించాం’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథే హీరో. మా చిత్రం చూసి ఎంత నవ్వుతారో అంతే భావోద్వేగానికి గురవుతారు. ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విదేశాల్లోని లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించాం’’ అని దర్శకుడు అరుణ్ పవార్ పేర్కొ న్నారు. ‘ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’ అని రోషిణి చెప్పారు.