సప్తగిరి హీరోగా.. ‘వజ్ర కవచధర గోవింద’ | Saptagiri New Movie Vajra Kavacha Dhara Govinda Poster Released | Sakshi
Sakshi News home page

సప్తగిరి హీరోగా.. ‘వజ్ర కవచధర గోవింద’

Published Sun, Jan 27 2019 5:33 PM | Last Updated on Sun, Jan 27 2019 5:40 PM

Saptagiri New Movie Vajra Kavacha Dhara Govinda Poster Released - Sakshi

అత‌ని పేరు గోవిందు.  ఫన్నీ దొంగ. అత‌నికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు స‌ప్తగిరి. క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఫ‌న్నీ దొంగ‌గా న‌టిస్తున్న సినిమా `వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌`.  ఈ సినిమాకు అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.  

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ `నా ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌` విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే.  తాజాగా రూపొందిస్తున్న `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అంత‌కు మించి స‌క్సెస్ కావాల‌నే త‌ప‌న‌తో కృషి చేస్తున్నాం. సినిమా చాలా బాగా వ‌స్తోంది.  సప్తగిరి వ్యావ‌హారిక శైలికి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. మా క‌థ‌కు అనుగుణంగానే ప‌వ‌ర్‌ఫుల్‌గా `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అనే టైటిల్‌ పెట్టాం` అని అన్నారు. వైభవీ జోషి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement