టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణ శిబిరానికి అధికారులు వస్తే రాద్ధాంతం చేసే తెలుగుదేశం నాయకులు అమెరికా వెళ్లిన ...
టీడీపీ నేతలను నిలదీసిన తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణ శిబిరానికి అధికారులు వస్తే రాద్ధాంతం చేసే తెలుగుదేశం నాయకులు అమెరికా వెళ్లిన లోకేశ్ వెంట ముఖ్యమంత్రి ఓఎస్‌డీ, ఓ ఐఏఎస్ అధికారి ఏ హోదాలో వెళ్లారో చెప్పాలని రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు.
అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యం ఖూనీ గురించి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే బాగుంటుందని టీడీపీ నేతలకు హితబోధ చేశారు. మంగళవారం సచివాలయంలో శాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా పేరిట చేతులు, కాళ్లు ఊపేందుకు ఏకంగా రూ.1.25 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు.