
ఇద్దరు సీఎంలు కలిసినా ఓర్వలేరా: తలసాని
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్నా ప్రతిపక్షాలు ఓర్వడం లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్నా ప్రతిపక్షాలు ఓర్వడం లేదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధినే ఇద్దరు సీఎంలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 100 సీట్లు గెలుచుకుంటుందన్నారు. పేదల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ వెంట గ్రేటర్ ప్రజలు నడుస్తారన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఎప్పటిలాగే తాను ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్తానని, అయితే కోడి పందాల కోసం కాదన్నారు. ఏపీలో తన మిత్రులను కలుసుకుంటానన్నారు.