స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈసంఘటన రాజాపేట మండలం రేనికుంటలో జరిగింది. చిన్నారి ఇంటి దగ్గర స్కూలు బస్సు దిగుతుండగా బ్యాగు బస్సు డోర్‌కు తగులుకుంది. ఇది గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చిన్నారిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన చిన్నారి భువన(5) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం..బస్సు కిందపడి చిన్నారి మృతి
Published Thu, Sep 1 2016 7:15 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement