క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల, సాయి దేదీప్య | pranjula, sai dedeepya enter in quarter final of fenesta open | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల, సాయి దేదీప్య

Published Thu, Oct 6 2016 11:28 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

pranjula, sai dedeepya enter in quarter final of fenesta open

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, యెద్దుల సాయి దేదీప్య తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రాంజల 6-1, 6-4తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలుపొందగా... అండర్-18 బాలికల సింగిల్స్ మూడో రౌండ్‌లో సాయి దేదీప్య 6-3, 6-3తో వాసవి (తమిళనాడు)ను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయి దేదీప్య 3-6,5-7తో హిమాని మోర్ (హరియాణా) చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్‌లో ఓటమి చవిచూసింది.

 

నిధి తొలి రౌండ్‌లో 6-1, 6-0తో సౌమ్య విజ్ (గుజరాత్)పై, రెండో రౌండ్‌లో 6-2, 6-2తో హర్ష సాయి చల్లా (హైదరాబాద్)పై గెలిచింది. సౌజన్య 3-6, 6-2, 2-6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి పాలైంది. అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి లు షేక్ హుమేరా, లలిత దేవరకొండ, సహజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మిక, హర్ష సాయి చల్లా, శ్రావ్య శివాని మూడో రౌండ్‌లో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో విష్ణువర్ధన్ 4-6, 3-6తో పరమ్‌వీర్ (చండీగఢ్)పై గెలుపొందగా... బెరైడ్డి సారుు శరణ్ రెడ్డి 6-7 (4/7), 6-1, 5-7తో రంజిత్ విరాళీ మురుగేశన్ (తమిళనాడు) చేతిలో పోరాడి ఓడిపోయాడు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement