
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల (భారత్)–లీ పెచి (చైనీస్ తైపీ) ద్వయం 2–6, 3–6తో నాలుగో సీడ్ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment