రన్నరప్‌ ప్రాంజల జంట | Pranjula Pair as Runnerup in ITF Tourney | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ ప్రాంజల జంట

Published Sat, May 26 2018 10:43 AM | Last Updated on Sat, May 26 2018 10:43 AM

Pranjula Pair as Runnerup in ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రాంజల–రలూకా సెర్బాన్‌ (రొమేనియా) ద్వయం 4–6, 4–6తో టాప్‌ సీడ్‌ గిలియానా (మెక్సికో)–లారా పిగోసి (బ్రెజిల్‌) జంట చేతిలో ఓడిపోయింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement