
ప్రాంజల ఓటమి
\సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 3–6, 4–6తో బియాంక మిహేలా (రొమేనియా) చేతిలో ఓడిపోయింది.