క్వార్టర్స్‌లో ప్రాంజల | pranjula enters quarter final in itf tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో ప్రాంజల

Published Thu, Oct 27 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

pranjula enters quarter final in itf tourny

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-1, 6-3తో శ్వేత చంద్ర రాణాపై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు డబుల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. ప్రాంజల- నిధి చిలుముల ద్వయం 0-6, 4-6తో రియా భాటియా- శ్వేత జోడీ చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement