అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల–జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6–3, 7–5తో వత్సకోల్ సవాస్డీ–చనికర్న్ సిలాకుల్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 2–6, 6–7 (4/7)తో వత్సకోల్ సవాస్డీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది.