సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల విభాగంలో సౌజన్య భవిశెట్టి సెమీస్‌కు చేరగా... శ్రేయ తటవర్తి, శ్రావ్య శివాని, భువన కాల్వ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నిక్కీ పునాచ ముందంజ వేశాడు. అండర్–18 బాలికల విభాగంలో రషి్మక భమిడిపాటి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–4, 6–3తో ప్రజ్వల్ దేవ్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరోసీడ్ దల్వీందర్ సింగ్ 7–6 (7/4), 7–5తో ఇక్బాల్‌పై, నాలుగో సీడ్ కునా ల్ ఆనంద్ 6–3, 7–6 (7/5)తో ఏడో సీడ్ నితిన్ కుమార్ సిన్హాపై, ఆర్యన్ 6–3, 6–7 (5/7), 6–3తో సూరజ్ ప్రబోద్‌పై నెగ్గారు.
మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సౌజన్య భవిశెట్టి 6–2, 6–2తో సాల్సా అహర్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, శ్రేయ తటవర్తి (ఆంధ్రప్రదేశ్) 2–6, 5–7తో నాలుగో సీడ్ ప్రేరణ బాంబ్రీ చేతిలో, శ్రావ్య శివాని (తెలంగాణ) 1–6, 1–6తో వైదేహి చౌదరీ చేతిలో, రెండో సీడ్ భువన (తెలంగాణ) 4–6, 2–6తో జగ్‌మీగ్ కౌర్ చేతిలో పరాజయం పాలయ్యారు. అండ ర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రష్మిక 6–4, 6–4తో టాప్ సీడ్ కశిష్ భాటియాను కంగుతినిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో సందీప్తి 6–2, 6–4తో బేలా తంహాంకర్‌పై, పూజ 7–6 (7/4), 6–2 తో ప్రేరణ విచారేపై, రేష్మ 7–5, 6–2తో ఆకాంక్ష నిట్టూరేపై గెలుపొందారు. అండర్–18 బాలు ర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ మన్ మాలిక్ షా 6–2, 6–2తో ఉద్‌వీర్ సింగ్‌పై, కామత్ 6–3, 6–4తో కబీర్‌పై, రోహన్ 6–1, 7–5తో చిరాగ్‌పై, ఉదిత్ గొగోయ్ 4–6, 6–1, 6–4తో కృషన్ హుడాపై విజయం సాధించారు.
టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడీ...
డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వై. సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఈ టోరీ్నలో సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో జతకట్టిన దేదీప్య డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–3, 3–6, 10–6తో అనూష (ఆంధ్రప్రదేశ్)–దక్షత పటేల్ (మహారాష్ట్ర) జోడీపై పోరాడి గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో సౌజన్య భవిశెట్టి (తెలంగాణ)–రిషిక సుంకర (ఢిల్లీ) జోడీతో సాయిదేదీప్య జంట తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment