క్వార్టర్ ఫైనల్లో హుమేరా | hurmera enters quater final in fenesta open | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో హుమేరా

Published Thu, Oct 13 2016 10:45 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

క్వార్టర్ ఫైనల్లో హుమేరా

క్వార్టర్ ఫైనల్లో హుమేరా

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో షేక్ హుమేరా 6-1, 4-6, 6-4తో సారా దేవ్పై విజయం సాధించింది. బాలుర విభాగంలో సిద్ధాంత్ 6-4, 6-4తో తోజ్యో ఓజెస్పై, అభిమన్యు 6-0, 6-0తో మోనీష్ షాపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అండర్-14 బాలబాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో ఆర్యన్ జవేరీ 6-2, 6-3తో నరేశ్ బడ్గుజర్పై గెలుపొందగా... సన్యా సింగ్ 7-6 (4), 6-2తో అదితిని ఓడించింది.

ఇతర మ్యాచ్ ఫలితాలు..

 అండర్-16 బాలురు: రిషబ్ 6-1, 6-3తో ఆయూష్ దేశ్వాల్పై, మేఘ్ కుమార్ పటేల్6-3, 6-0తో సంకేత్ తోమర్పై, అర్జున్ 6-4, 5-7, 6-2తో రోహిత్పై, సురేశ్6-1, 6-0తో నీరజ్ యశ్పాల్పై, దేవ్ 6-2, 7-5తో రిథమ్ మల్హోత్రాపై గెలుపొందారు.
 బాలికలు: వైదేహి 6-0, 6-0తో గార్గి పవార్పై, అయేషా పటేల్ 6-0, 6-1తో దామినిపై, తనీషా కశ్యప్ 6-2, 6-0తో ముబషిరా షేక్పై, ప్రింకెల్సింగ్ 6-2, 6-2తో ప్రియాన్షి భండారిపై, సల్సా అహర్ 6-1, 6-0తో మలైకాపై, శరణ్య 6-2, 6-3తో యుబ్రాని బెనర్జీపై, భక్తి పర్వాణి 7-6 (6), 1-6, 6-3తో సాయి దేదీప్యపై విజయం సాధించారు.

 అండర్-14 బాలురు: దేవ్ 6-4, 6-2తో క్రిష్ పటేల్పై, సందీప్ 6-3, 6-3తో ఆదర్శ్ నాగపై, నితిన్ జైపాల్ 6-2, 6-3తో ఆదిత్య వర్ధన్పై, అజయ్ 6-0, 6-3తో రాజేశ్పై, దివేశ్ 5-7, 6-1, 7-6తో ఉదిత్పై, నిశాంత్ 6-0, 6-7 (4), 7-6 (3)తో భూపతిపై నెగ్గారు.

 బాలికలు: శరణ్య 6-3, 6-3తో సంస్కృతిపై, సారా దేవ్ 6-2, 6-2తో బేలా తన్హాంకర్పై, రిచా 4-6, 6-4, 6-1తో వన్షిక చౌదరీపై, మలైకా 6-0, 6-1తో గార్గి పవార్పై, వినీత 6-2, 1-0తో అర్చితపై, సందీప్తి సింగ్ 6-3,7-5తో భక్తి పర్వాణిపై, ప్రియాన్షి భండారి 6-0, 6-0తో పూర్వి భట్పై గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement