humera
-
హుమేరా–పూజా జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. బెంగళూరులో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో హుమేరా భారత్‌కే చెందిన పూజా ఇంగాలెతో కలిసి డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ హుమేరా–పూజా ద్వయం 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆకాంక్ష–సోహా సాదిక్ (భారత్) జోడీపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హుమేరా–పూజా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకొని, ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. హుమేరా కెరీర్లో ఇది రెండో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2022లో హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రష్మికతో కలిసి హుమేరా గుర్‌గ్రామ్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో తొలిసారి డబుల్స్ టైటిల్‌ను సాధించింది. -
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా జోడీ
మైసూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి హుమేరా బహార్మస్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) జోడీ 7–6 (10/8), 6–4తో యశస్విని పన్వర్–వన్షిత పథానియా (భారత్) జంటపై గెలుపొందింది. తెలంగాణకే చెందిన స్మృతి భాసిన్ కూడా డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో స్మతి భాసిన్ (భారత్)–ఎలీనా జంషీది (డెన్మార్క్) ద్వయం 6–4, 6–4తో సోనల్ పాటిల్ (భారత్)–ప్రిషా వ్యాస్ (అమెరికా) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌లో అభయ వేమూరి, అపూర్వ వేమూరి తొలి రౌండ్లోనే ని్రష్కమించారు. అభయ 4–6, 3–6తో పూజా ఇంగాలె చేతిలో, అపూర్వ 5–7, 2–6తో యశస్విని చేతిలో ఓడిపోయారు. -
విజేత హుమేరా
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా అండర్–18 బాలికల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో హుమేరా 6–2, 6–4తో తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మికపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిద్ధార్థ్ 6–2, 6–7 (2/7), 6–3తో అర్జున్‌పై... మహిళల సింగిల్స్ ఫైనల్లో మహెక్ 6–1, 6–2తో జీల్ దేశాయ్‌పై గెలిచారు. విజేతలకు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ ట్రోఫీలను అందజేశారు. -
హుమేరా శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా 7–6 (8/6), 0–6, 6–3తో ప్రతిభ నారాయణ్ (కర్ణాటక)పై గెలిచింది. అండర్–18 బాలికల సింగిల్స్‌లో హుమేరా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో హుమేరా 6–1, 6–0తో చావి రాఠి (హరియాణా)ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన సామ సాత్విక, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కొండవీటి అనూష రెండో రౌండ్‌కు చేరారు. తొలి రౌండ్లో సాత్విక 6–1, 6–1తో వన్షిత (కర్ణాటక)పై, అనూష 2–6, 7–5, 6–0తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)పై గెలిచారు. అండర్–18 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 6–2, 6–2తో సుదీప్త (మహారాష్ట్ర)పై, లక్ష్మి సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6–2, 6–2తో పూజ ఇంగ్లే (మహారాష్ట్ర)పై నెగ్గారు. స్మృతి భాసిన్ (తెలంగాణ) 1–6, 4–6తో త్రిషా వినోద్ (కేరళ) చేతిలో... సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 2–6, 5–7తో ఫర్హత్ కమర్ (రాజస్తాన్) చేతిలో... భక్తి షా (తెలంగాణ) 1–6, 5–7తో కశిష్ భాటియా (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు అండర్–18 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–2తో అథర్వ శర్మ (మహారాష్ట్ర)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు హుమేరా
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఐటీఎఫ్ జూనియర్స్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ బాలికల చివరి రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ హుమేరా 5-7, 6-3, 7-5తో హర్లీన్ కౌర్ (చండీగఢ్)ను ఓడించింది. బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ అలెక్స్ సోలెంకి 6-4, 6-1తో ఐదో సీడ్ సాగర్ బైన్సపై గెలుపొంది మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. మెయిన్ డ్రా మ్యాచ్‌లు నేటి (సోమవారం) నుంచి ఈనెల 7 వరకు జరుగుతాయి. ఇతర బాలుర మ్యాచ్‌ల్లో ఆర్. బొల్లిపల్లి 4-6, 7-5, 6-3తో అశుతోష్ తివారిపై, సుమిత్ పాల్ సింగ్ 6-3, 4-6, 6-4తో కృషన్ హుడాపై, అథర్వ శర్మ 6-0, 6-3తో ద్రోణ వాలియాపై గెలుపొందారు. బాలికల మ్యాచ్‌ల్లో శివాని మంజన్న 6-3, 6-1తో మిషా సూద్‌పై, యుబ్రాని బెనర్జీ 7-6 (7), 6-1తో దాదాసాహెబ్ చౌగ్లేపై, గౌరీ భాగియా 6-2, 6-3తో అంజలి మొగిలిపై విజయం సాధించారు. -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో షేక్ హుమేరా 6-1, 4-6, 6-4తో సారా దేవ్‌పై విజయం సాధించింది. బాలుర విభాగంలో సిద్ధాంత్ 6-4, 6-4తో తోజ్యో ఓజెస్పై, అభిమన్యు 6-0, 6-0తో మోనీష్ షాపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అండర్-14 బాలబాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆర్యన్ జవేరీ 6-2, 6-3తో నరేశ్ బడ్గుజర్పై గెలుపొందగా... సన్యా సింగ్ 7-6 (4), 6-2తో అదితిని ఓడించింది. ఇతర మ్యాచ్ ఫలితాలు.. అండర్-16 బాలురు: రిషబ్ 6-1, 6-3తో ఆయూష్ దేశ్వాల్పై, మేఘ్ కుమార్ పటేల్6-3, 6-0తో సంకేత్ తోమర్‌పై, అర్జున్ 6-4, 5-7, 6-2తో రోహిత్‌పై, సురేశ్6-1, 6-0తో నీరజ్ యశ్‌పాల్‌పై, దేవ్ 6-2, 7-5తో రిథమ్ మల్హోత్రాపై గెలుపొందారు. బాలికలు: వైదేహి 6-0, 6-0తో గార్గి పవార్‌పై, అయేషా పటేల్ 6-0, 6-1తో దామినిపై, తనీషా కశ్యప్ 6-2, 6-0తో ముబషిరా షేక్‌పై, ప్రింకెల్సింగ్ 6-2, 6-2తో ప్రియాన్షి భండారిపై, సల్సా అహర్ 6-1, 6-0తో మలైకాపై, శరణ్య 6-2, 6-3తో యుబ్రాని బెనర్జీపై, భక్తి పర్వాణి 7-6 (6), 1-6, 6-3తో సాయి దేదీప్యపై విజయం సాధించారు. అండర్-14 బాలురు: దేవ్ 6-4, 6-2తో క్రిష్ పటేల్‌పై, సందీప్ 6-3, 6-3తో ఆదర్శ్ నాగపై, నితిన్ జైపాల్ 6-2, 6-3తో ఆదిత్య వర్ధన్‌పై, అజయ్ 6-0, 6-3తో రాజేశ్‌పై, దివేశ్ 5-7, 6-1, 7-6తో ఉదిత్‌పై, నిశాంత్ 6-0, 6-7 (4), 7-6 (3)తో భూపతిపై నెగ్గారు. బాలికలు: శరణ్య 6-3, 6-3తో సంస్కృతిపై, సారా దేవ్ 6-2, 6-2తో బేలా తన్హాంకర్పై, రిచా 4-6, 6-4, 6-1తో వన్షిక చౌదరీపై, మలైకా 6-0, 6-1తో గార్గి పవార్‌పై, వినీత 6-2, 1-0తో అర్చితపై, సందీప్తి సింగ్ 6-3,7-5తో భక్తి పర్వాణిపై, ప్రియాన్షి భండారి 6-0, 6-0తో పూర్వి భట్‌పై గెలిచారు. -
ఆర్టీడబ్ల్యూ కోసం శివాని, హుమేర
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌లో జరిగే ‘రోడ్ టు వింబుల్డన్’ (ఆర్టీడబ్ల్యూ) జాతీయ టోర్నీ కోసం భారత్‌లో నిర్వహించే క్వాలిఫయింగ్ టోర్నీలో తెలంగాణ, ఏపీలకు చెందిన 12 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు శివాని అమినేని, షేక్ హుమేరా బేగం చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బాలికల జట్టులో సాయి దేదీప్య, ధరణ ఆనంద్, శ్రీవల్లి రష్మిక, రచనా రెడ్డి ఉన్నారు. బాలుర జట్టులో రిత్విక్ చౌదరి, తీర్థ శశాంక్, మెంగా రోహిత్, ఆశిష్ నంద్, ఆకాశ్ రెడ్డి, శ్రీహర్షిత్ ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బాలబాలికల జట్లు అలిండియా టెన్నిస్ సంఘం (ఐటా) నిర్వహించే క్వాలిఫయింగ్ ఈవెంట్లలో పోటీపడతాయి. మొత్తం నాలుగు నగరాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 12న కోల్‌కతాలో, 19న చండీగఢ్‌లో, ఫిబ్రవరి 2న ఢిల్లీలో, 9న ముంబైలో ఈ పోటీలు జరుగుతాయి. అనంతరం ఢిల్లీలో ఏప్రిల్ 6న జరిగే ఫైనల్ ఈవెంట్లో గెలుపొందిన విజేతలను రోడ్ టు వింబుల్డన్ జాతీయ మాస్టర్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. ఈ ఈవెంట్ ఇంగ్లండ్‌లో ఆగస్టులో జరగనుంది.