ఫ్రాన్స్‌లో జరిగిన ‘లా ప్లాన్’ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్íÙప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన రిత్విక్ తొమ్మిదో సీడ్‌లో బరిలోకి దిగి 5 విజయాలు, 4 ‘డ్రా’ల తర్వాత మొత్తం 7 పాయింట్లు సాధించాడు.
మరో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నియాన్ పన్నీర్‌సెల్వం, ప్రణీత్ ఉప్పల, ధూళిపాళ బాలచంద్రప్రసాద్‌లతో సమంగా నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా రిత్విక్‌కు రెండో స్థానం దక్కగా, ఇన్నియాన్‌కు కాంస్యం లభించింది. ఫ్రెంచ్ జీఎం జూల్స్ మాసర్డ్ 7.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు.
జూల్స్, రిత్విక్ మధ్యే జరిగిన 9వ రౌండ్ పోరు 28 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో 17 దేశాలకు చెందిన 184 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 17 మంది గ్రాండ్‌మాస్టర్లు, 40 మంది ఇంటర్నేషనల్ మాస్టర్‌లు ఉన్నారు. రాజా రితి్వక్ ఇటీవలే జాతీయ ర్యాపిడ్ చాంపియన్íÙప్‌లో కాంస్యం, జాతీయ బ్లిట్జ్ చాంపియన్íÙప్‌లో రజతం గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment