
బియాస్ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యం
హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా సహాయ బృందాలు ఆదివారం రెండు మృతదేహాలను వెలికితీశాయి. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన రిత్విక్, వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పరమేష్గా గుర్తించారు. దాంతో ఇప్పటివరకు 15 మృతదేహాలు లభ్యమైనాయి. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీన 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే.