
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో జి. ప్రణీత రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. ఆదిలాబాద్‌లోని బీఆర్ అంబేడ్కర్ భవన్ కలెక్టర్ చౌక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె యూత్ బాలికల, మహిళల కేటగిరీల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన యూత్ బాలికల ఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 11–2, 10–12, 11–5, 11–9, 10–12, 11–7తో అంజలి (జీఎస్‌ఎం)పై విజయం సాధించింది. మహిళల తుదిపోరులో ప్రణీత 11–2, 10–12, 11–5, 10– 12, 11–5, 8–11, 11–6తో మౌనిక (జీఎస్‌ఎం)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment