రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో అనంతపురానికి చెందిన శ్రేష్ట, నాగశ్రావణి సత్తా చాటారు. ఈ నెల 15 నుంచి 17 వరకు గుంటూరులో ఫస్ట్ ఏపీ స్టేట్ టీటీ ర్యాంకింగ్ పోటీలు జరిగాయి. అందులో అండర్ –12 విభాగంలో శ్రేష్ట విజేతగా నిలిచింది. తొలి రాష్ట్రస్థాయి టైటిల్‌ను సాధించడం విశేషం. నాగశ్రావణి జూనియర్ విన్నర్‌గా, యూత్, ఉమెన్ విభాగంలో రన్నర్‌గా నిలిచింది. వీరి ప్రతిభ పట్ల టీటీ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అక్బర్ సాహెబ్, కోచ్ రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.