
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బి. రాగ నివేదిత (జీటీటీఏ), జి. ప్రణీత (హెచ్‌వీఎస్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–3తో సృష్టి (ఏవీఎస్‌సీ)పై గెలుపొందగా... ప్రణీత 4–0తో ప్రాచీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో మోనిక (జీఎస్‌ఎం) 4–1తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, వరుణి (జీఎస్‌ఎం) 4–0తో కీర్తనపై, భవిత (జీఎస్‌ఎం) 4–0తో వినిచిత్ర (జీఎస్‌ఎం)పై, లాస్య 4–0తో నిఖితపై, సస్య 4–1తో దియా వోరాపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.
యూత్ బాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో రాగ నివేదిత 4–1తో సృష్టిపై, ప్రణీత 4–0తో నిఖిత (వైఎంసీఏఎక్స్‌టీటీఏ)పై, సస్య 4–0తో విధి జైన్‌పై, లాస్య 4–0తో కీర్తనపై, భవిత 4–1తో ఇక్షితపై, హనీఫా 4–1తో శరణ్యపై గెలుపొందారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాలానీ గ్రూప్ చైర్మన్, ఎండీ పురుషోత్తమ్ పోటీలను ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment