సాక్షి, హైదరాబాద్: సామ్‌రెడ్డి సుదర్శన్ రెడ్డి స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుణి జైస్వాల్ సత్తా చాటింది. బండ్లగూడ మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో వరుణి జైస్వాల్ యూత్ బాలికలు, మహిళల కేటగిరీలలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. బుధవారం యూత్ బాలికల తుదిపోరులో వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) 11–8, 6–11, 11–8, 7–11, 11–5, 11–6తో నైనా (ఎల్బీ స్టేడియం)పై, మహిళల ఫైనల్లో 11–9, 10–12, 11–9, 10–12, 11–9, 8–11, 11–4తో జి. ప్రణీత (హెచ్‌వీఎస్)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో అమన్ (సీఆర్‌ఎస్‌సీబీ) 11–7, 11–9, 11–5, 4–11, 12–14, 7–11, 15–13తో విఘ్నయ్ రెడ్డి (ఆర్‌బీఐ)ని ఓడించి విజేతగా నిలిచాడు.
యూత్ బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ (ఏడబ్ల్యూఏ) 12–14, 11–8, 11–3, 11–3, 11–7తో సాయినాథ్ రెడ్డి (ఎంఎల్‌ఆర్)పై గెలిచాడు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో జషన్ సాయి 6–11, 11–9, 8–11, 11–2, 11–6, 11–8తో త్రిశూల్ మెహ్రా (ఎల్‌బీఎస్)పై, జూనియర్ బాలుర ఫైనల్లో కేశవన్ కన్నన్ (ఎంఎల్‌ఆర్) 11–8, 11–6, 11–8, 7–11, 9–11, 11–7తో జషన్ సాయి (ఎంఎల్‌ఆర్)పై గెలుపొందారు. మరోవైపు సబ్ జూనియర్ బాలికల తుదిపోరులో అనన్య (జీఎస్‌ఎం) 8–11, 11–8, 11–9, 11–6, 11–5తో పలక్ (జీఎస్‌ఎం)పై, జూనియర్ బాలికల ఫైనల్లో భవిత (జీఎస్‌ఎం) 11–9, 11–8, 10–12, 10–12, 11–4, 11–8తో పలక్‌పై గెలుపొంది టైటిళ్లను కైవసం చేసుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం (టీఎస్‌టీటీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
వరుణి జైస్వాల్ డబుల్ ధమాకా
Published Thu, Jun 20 2019 1:52 PM | Last Updated on Thu, Jun 20 2019 1:52 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment