
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో ఆంధ్ర విద్యాలయ (ఏవీ) కాలేజి జట్టు విజేతగా నిలిచింది. సెయింట్ జోసెఫ్ కాలేజి వేదికగా శనివారం జరిగిన టైటిల్ పోరులో ఏవీ కాలేజి 3–0తో ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి జట్టుపై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బద్రుకా కాలేజి (కాచిగూడ) 3–1తో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజిని ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఏవీ కాలేజి 3–0తో బద్రుకాపై, ఎంవీఎస్‌ఆర్ 3–2తో సెయింట్ జోసెఫ్ కాలేజిపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఇంటర్ కాలేజి టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment