భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాట్స్.. తెలుగు వేడుకలకు సిధ్దమైంది. ఇందులో భాగంగా నిర్వహించిన 'బ్యాడ్మింటన్ మరియు పికిల్‌బాల్' టోర్నమెంట్స్ కి విశేష స్పందన వచ్చింది. టెక్సాస్‌లోని లెవిస్‌విల్లేలో నిర్వహించిన ఈ పోటీల్లో ప్లేయర్స్ పెద్ద ఎత్తున పాల్గొని క్రీడా స్పూర్తిని చాటారు.
ఒపెన్ మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఒపెన్ ఉమెన్స్ డబుల్స్, సినీయర్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. మెన్స్ అండ్ ఉమెన్స్ డబుల్స్ విభాగాల్లో పికిల్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. యూత్‌ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఆసక్తిగా సాగాయి. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. మార్చి 15,16 తేదీల్లో జరిగే నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలను అందించనున్నారు.
ఈ పోటీలు గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నడిపించిన ప్రతిఒక్కరికి నాట్స్ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. డల్లాస్ వేదికగా నాట్స్ తెలుగు వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు నూతి బాపు తెలిపారు. ఈ వేడుకల్లో యువతను భాగస్వామ్యం చేస్తూ.. పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు డల్లాస్ తెలుగు వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment