సిల్వర్ సింధుకు జేజేలు
సిల్వర్ సింధుకు జేజేలు
Published Fri, Aug 19 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
విజయవాడ స్పోర్ట్స్ :
‘బేటీ బచావో,...బేటీ పడావో మాత్రమే కాదు... ‘బేటీ ఖేలావో’ (ఆడపిల్లల్ని ఆడించండి) అంటూ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తన అసమాన ప్రతిభాపాటవాలతో రజత పతక విజేతగా నిలిచిన ‘సింధు’ ఒక క్రీడా నాగరికతగా చాటిచెప్పిందని రాజధాని అమరావతి ప్రజలు కీర్తించారు. రియో ఒలింపిక్స్‌లో శుక్రవారం నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్‌ను నగర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. నగరంలో దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం, ట్రెండ్‌సెట్, పీవీఆర్ మాల్, విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, పుష్కరఘాట్లు, విజయవాడ క్లబ్, టీస్టాల్స్ ఇలా దాదాపు అన్ని చోట్ల టీవీలోప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. మొదటి సెట్‌లో సింధు విజేతగా నిలవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. తరువాత రెండు సెట్లను సీనియర్ క్రీడాకారిణిగా, వరల్డ్ నెంబర్ వన్‌గా ఉన్న రెండు సార్లు ఒలింపియన్ పతక విజేతగా కరోలినా మారిన్ విజయం సాధించింది. అయినా కూడా సింధుకు అభిమానులు నీరాజనాలు పలికారు. ‘సింధు, సింధు గో గోల్డ్’ అంటూ చేసిన నినాదాలు మార్మోగాయి. తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా తెలుగుతేజానికి జేజేలు పలికారు.
నగర ప్రేక్షకుల మాదిరిగానే ఎంతో ఉత్కంఠతతో ్రçపభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీలో సింధు మేనత్తలు శ్రీలక్ష్మి, ప్రసన్న, దుర్గాదేవితో పాటు వారి కుటుంబ సభ్యలంతా టీవీలో లైవ్ మ్యాచ్‌ను వీక్షించారు. సోదరుడు రమణ తండ్రికి తగ్గ తనయిగా వారు అభివర్ణించారు. స్వర్ణపతకం చేజారినా కూడా ఒకింత నిరాశ చెందినా సింధు చూపిన సత్తాకు రజత పతకం కూడా గొప్పదే అని సంతోషం వ్యక్తం చేశారు. సింధుకు చాలా భవిష్యత్తు ఉందని కనీసం మరో రెండు ఒలింపిక్స్‌లో సింధునే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని మేనత్తలు ఆకాంక్షించారు.
చిన్నారుల ర్యాలీ..
సింధు స్వర్ణపతకం సాధించాలని కోరుతూ దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియం బ్యాడ్మింటన్ చిన్నారులు బందరు రోడ్డు నుంచి సీఎం క్యాంపు ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించింది. ర్యాలీలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి కేసీహెచ్ పున్నయ్య చౌదరి, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె.పట్టాభిరామ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్.రామ్మోహన్, డాక్టర్ ఇ.త్రిమూరి,్త క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన టీవీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.
క్రీడా సంఘాల అభినందల వెల్లువ
రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి కొత్త రికార్డు సృష్టించిన పీవీ సింధుకు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో శాప్ వీసీ అండ్ ఎండీ జి.రేఖారాణి, ఓఎస్‌డీ పి.రామకృష్ణ, ఎంబీ సిరాజుద్దీన్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శులు చెరుకూరి సత్యనారాయణ, ఆకుల రాఘవేంద్రరావు, కేపీరావు, టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రంభా ప్రసాద్, త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి ఇ.సులోచన, అర్జా పాండు రంగారావు ఉన్నారు.
బస్టాండ్‌లో ఉత్కంఠ వీక్షణం
విజయవాడ(బస్‌స్టేçÙన్) : బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన సింధు ఆటను వీక్షించేందుకు పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రెండు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శించారు. భారత్‌కు రెండో పతకం రావడంతో కేరింతలతో అభినందనలు తెలిపారు.
Advertisement
Advertisement