సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
సింధుకు రూ.6లక్షల వజ్రాభరణం
Published Wed, Aug 24 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ఎన్‌ఏసీ జ్యూవెలరీ ఎండీ అనంత పద్మనాభన్
విజయవాడ స్పోర్ట్స్ :
రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు రూ.6లక్షల విలువైన వజ్రాభరణం బహూకరించనున్నట్లు ఎన్‌ఏసీ జ్యూవెలర్స్ ఎండీ అనంతపద్మనాభన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి సింధుకు సిగ్నేచర్ నెక్‌పీస్‌ను బహూకరిస్తామని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లోనే ఉమెన్ ఫ్రీస్టయిల్(58 కేజీల) విభాగం కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, జిమ్నాస్టిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్‌కు రూ.3లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌లను అందిస్తామని తెలిపారు. యువతకు స్ఫూర్తినిచ్చేందుకే తాము వీరికి ఆభరణాలు బహూకరించి గౌరవిస్తున్నట్లు వివరించారు.
Advertisement