
ఆమిర్ 'పీకే' .. 2 రోజుల్లో రూ. 50 కోట్లు
ఆమిర్‌ఖాన్ తాజా చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద విజయఢంకా మోగిస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. పీకే చిత్రం తొలి రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆమిర్ ఖాన్ నటన, రివ్యూలు పాజిటీవ్గా ఉండటం, తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్లు ఓవరాల్గా 300 కోట్ల రూపాయల మార్క్ను చేరుకోవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్‌చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమిర్ సరసన అనుష్క శర్మ నటించారు.