డిసెంబర్ 19న అమీర్ ఖాన్ 'పీకే' విడుదల!
డిసెంబర్ 19న అమీర్ ఖాన్ 'పీకే' విడుదల!
Published Tue, Apr 15 2014 9:22 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM
ముంబై: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం ముందునుకున్న తేది కంటే వారం రోజుల ముందే విడుదలకు సిద్దమవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది.
డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
క్రిస్మస్ కానుకగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ లు నటిస్తున్నారు.
Advertisement
Advertisement