భారత్లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు | 'PK' crosses Rs.214 crore in India | Sakshi
Sakshi News home page

భారత్లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు

Published Sun, Dec 28 2014 4:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

భారత్లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు - Sakshi

భారత్లోనే రూ. 214 కోట్ల కలెక్షన్లు

న్యూఢిల్లీ : రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు భారత్లోనూ 214 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.

కాగా ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో పాటు అమీర్ నటనకు ప్రశంసలు రావడంతో ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటించారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement