
నాలుగు రోజుల్లో రూ. 136 కోట్లు!
రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ఖాన్, అనుష్కాశర్మ జంటగా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం 'పీకే'ను ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమా రూ. 136 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ బాక్సాఫీసు లెక్కలు చూసే నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కేవలం భారతదేశంలోనే. ఓవర్సీస్ వసూళ్ల విషయం ఇంకా చెప్పలేదు. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని భావిస్తున్నారు.
(పీకే సినిమాపై మరో ఎఫ్ఐఆర్)
ఈ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసి హీరోయిన్ అనుష్కాశర్మ పొంగిపోతోంది. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి కళ్ల వెంబడి నీళ్లు ఆగడంలేదని ట్విట్టర్ ద్వారా చెప్పింది. హృదయపూర్వకంగా తాను అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు అందులో పేర్కొంది.
I am literally in tears reading the overwhelming love & response you guys have shown for PK & us .Thank you from the bottom of my heart ❤️
— JAGAT JANANI (@AnushkaSharma) December 22, 2014