బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన చిత్రం ‘పీకే’ను నిలిపివేయాలని కోరుతూ సోమవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు....
తాండూరు: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన చిత్రం ‘పీకే’ను నిలిపివేయాలని కోరుతూ సోమవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్లు సుమిత్‌కుమార్‌గౌడ్, లింగదళ్లి రవికుమార్, భీంసింగ్ రాథోడ్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు అర్బన్ ఎస్‌ఐ అభినవ చతుర్వేదికి ఫిర్యాదు చేశారు. ‘పీకే’ చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. చిత్ర దర్శకుడితోపాటు నిర్మాతపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నాయకులు తమ ఫిర్యాదులో డిమాండ్ చేశారు. బషీరాబాద్‌లో కూడా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక వివేకానంద యువజన సంఘం సభ్యులు ‘పీకే’ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.