
ఎంపి సతీష్ చంద్ర మిశ్రా - పికె పోస్టర్
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌కు బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పి) ఎంపి సతీష్ చంద్ర మిశ్రా పరోక్షంగా చురకలంటించారు. అమీర్ తన తదుపరి చిత్రం ‘పీకే’కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో దాదాపు నగ్నంగా కనిపించడాన్ని తప్పుబట్టారు.
సామాజికాంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ తనను తాను గొప్ప సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో ఈ చర్యకు పాల్పడ్డారని పరోక్షంగా ఆమీర్ ఖాన్ను విమర్శించారు. చట్టం ఇటువంటి చర్యలను నిషేధించిందని, వాటిని ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.