
పీకే బీట్స్..!
ఆమిర్‌ఖాన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పీకే’ గల్లా పెట్టెను పరుగులెత్తిస్తోంది. సీక్వెల్ సినిమా ‘ధూమ్ 3’... సల్మాన్‌ఖాన్ సూపర్ హిట్ ‘కిక్’... షారూఖ్‌ఖాన్ మెగా హిట్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ లను దాటేసి దూసుకుపోతోంది. ఇప్పటికే డొమెస్టిక్ మార్కెట్‌లో హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులు తిరగరాసింది.
పదమూడు రోజుల్లో మొత్తం 263 కోట్ల రూపాయలు వసూలు చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ధూమ్ 3 (రూ.261 కోట్లు), కిక్ (రూ.212 కోట్లు), చెన్నై ఎక్స్‌ప్రెస్ (రూ.208 కోట్లు), త్రీ ఇడియట్స్ (రూ.201 కోట్లు)ను క్రాస్ చేసింది. కాగా.. ఒక మతానికి సంబంధించిన సెంటిమెంట్స్‌ను కించపరిచేలా సినిమా ఉందంటూ ‘పీకే’పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.